Sun Dec 22 2024 21:58:51 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 23 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారితో జరిపే చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక వెసులుబాటు..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్రవారం
తిథి : శు.పంచమి రా.7.53 వరకు
నక్షత్రం : మఖ పూర్తిగా..
వర్జ్యం : సా.5.47 నుండి 7.35 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.23 నుండి 9.16 వరకు, మ.12.44 నుండి 1.36 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.2.00 నుండి 2.40 వరకు, సా.4.50 నుండి 5.35 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వైద్య సంప్రదింపులుంటాయి. వివాదాలు, తగాదాలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. కొండల్లాగా వచ్చిన సమస్యలు మబ్బుల్లా విడిపోతాయి. విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శుభవార్తలు వింటారు. కొత్తవిషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో స్పష్టత వస్తుంది. అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారితో జరిపే చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. సంఘ గౌరవాన్ని కలిగిఉంటారు. రిటైర్ అయినవారికి ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. అలసట ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. అపార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన ప్రయాణాలు చేస్తారు. మానసికంగా ఊరటనిచ్చే విహార, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం లభిస్తుంది. ఎదుటివారితో మాటామంతి సాగిస్తారు. అన్నింటా పై చేయిగా ఉంటుంది. క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గడిచిన రెండ్రోజులకంటే అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు ఒత్తిడికి గురిచేస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడుల నుంచి మార్గాలు లభిస్తాయి. దృష్టిదోషం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. మీ తప్పు లేకున్నా మీరే తలొంచుకుని ముందుకు వెళ్లాలి. వీలైనంత వరకూ మౌనంగా ఉండటం మంచిది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారిని ఆకట్టుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. సౌకర్యాలను సమకూర్చుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న బిల్లులపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎదుటివారిని అర్థం చేసుకుంటారు. పరిచయాలు ఉపకరిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల మార్పులుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
Next Story