Sun Dec 22 2024 21:08:40 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 24 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శనివారం
తిథి : శు.షష్ఠి రా.10.16 వరకు
నక్షత్రం : మఖ ఉ.7.17 వరకు
వర్జ్యం : సా.4.14 నుండి 6.02 వరకు
దుర్ముహూర్తం : ఉ.5.47 నుండి 7.31 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.50 నుండి 11.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక విషయాలు నిరుత్సాహంగా ఉంటాయి. వివాదాలు తప్పకపోవచ్చు. ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు సాధారణంగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. బద్ధకం పెరగుతుంది. వృథా ఖర్చులు చోటుచేసుకుంటాయి. అపార్థాలు పెరుగుతాయి. తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. తుది నిర్ణయాలు తీసుకుంటారు. క్రీడారంగంలో ఉన్నవారికి, సాహిత్య, రాజకీయాల రంగాలవారికి ఊరటనిచ్చే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనవసరమైన ఖర్చులుంటాయి. మాటతీరులో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాలకు ప్రాధాన్యమిస్తారు. ఎదుటివారి నుంచి సహాయసహకారాలు నామమాత్రంగా ఉంటాయి. లాభనష్టాలుండవు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రిటైర్ అయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంచనాలు తారుమారవుతాయి. అయోమయానికి గురవుతారు. వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు. మనసొకచోట, మనిషొకచోట అన్నట్టుగా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ ను పెంచుకోవాలన్న ఆలోచనలు బలపడుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటారు. రోజంతా ఆనందంగా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారికి సలహాలిస్తారు. అలాగే వారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆర్థిక విషయాలు ఊరటనిస్తాయి. వైద్యసంప్రదింపులు, వాహనాల మరమ్మతులు, ఇంటి పనులు అన్నీ ముందుకు సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. గౌరవించేవారు, తిట్టేవారు కూడా అలాగే ఉంటాయి. రహస్యాలను మెయింటేన్ చేయాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. దంపతుల మధ్య తగాదాలు రావొచ్చు. కొనుగోళ్లు మనసుకి తృప్తినివ్వవు. చికాకుగా ఉంటారు. కోపం పెరుగుతుంది. రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సంబంధించినవి, గౌరవ మర్యాదల అంశాలు సానుకూలంగా ఉంటాయి. శుభకార్యాలు ముందుకు సాగుతాయి. క్రయవిక్రయాలకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలం. తప్పులను సరిచేసుకునేందుకు, శత్రువులపై పైచేయి సాధించేందుకు అనుకూలమైన కాలం. తృప్తిగా ఉంటారు. సౌకర్యంగా జీవిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
.
.
.
Next Story