Sun Dec 22 2024 21:51:44 GMT+0000 (Coordinated Universal Time)
WEEKLY HOROSCOPE : నేటి పంచాగం, జూన్ 25 నుండి జులై 1 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రతి పనిలో మీదే పైచేయిగా ఉంటుంది. ఏ పనిచేపట్టినా మొండిపట్టుదలగా..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, ఆదివారం
తిథి : శు.సప్తమి రా.12.23 వరకు
నక్షత్రం : పూర్వఫల్గుణి ఉ.10.09 వరకు
వర్జ్యం : సా.6.06 నుండి 7.52 వరకు
దుర్ముహూర్తం : సా.5.04 నుండి 5.56 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : ఉ.10.50 నుండి 11.40 వరకు
శుభసమయాలు : లేవు
నవగ్రహ సంచారం
మేషం - గురువు, రాహువు
మిథునం - రవి, బుధుడు
కర్కాటకం - కుజుడు, శుక్రుడు
శనివారం నుండి సింహంలోకి కుజుడు
తుల - కేతువు
కుంభం - శని
చంద్రగ్రహ సంచారం
సింహం, కన్య, తుల, వృశ్చికం
జూన్ 25 నుండి జులై 1 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నా సద్వినియోగపడుతాయి. గౌరవ, మర్యాదలు ఉంటాయి. ప్రతి పనినీ ప్లాన్ ప్రకారం చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. జఠిలమైన సమస్యలపై దృష్టిసారిస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తెలియకుండానే చిన్నచిన్న గాయాలు కావొచ్చు. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రతి పనిలో మీదే పైచేయిగా ఉంటుంది. ఏ పనిచేపట్టినా మొండిపట్టుదలగా ముందుకు సాగుతారు. ముక్కుసూటితనంగా వ్యవహరిస్తారు. ప్రయాణాలు, శుభకార్యాలు, బంధువర్గంతో గడిపే క్షణాలు మానసిక ఆనందాన్నిస్తాయి. చిన్న అనారోగ్యాన్ని కూడా భూతద్దంలో చూస్తారు. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఒడిదుడుకులుగా కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చుచేయాల్సిన అవసరాలు వస్తాయి. ఇంట్లో ప్రతి చిన్న విషయాలకు తగాదాలు అవుతుంటాయి. చికాకు, అసంతృప్తి పెరుగుతాయి. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రతివిషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్నిపనులు ఆగకుండా జరిగినా.. అనారోగ్య సమస్యలు పదే పదే ఇబ్బంది పెడుతుంటాయి. పనులు వాయిదా వేయడం మంచిదికాదు. ఏదో ఒక వర్గంవైపే ఉండటం వల్ల మరోవర్గం మిమ్మల్ని అపార్థం చేసుకుంటుంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఈ వారం సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం శ్రమ పెరుగుతుంది. సమయం తీరిక లేకుండా గడుపుతారు. నిద్రాహారాలకు కూడా సమయం ఉండదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోయిన శత్రువులే ఇబ్బందుల పాలవుతారు. చిన్న అనారోగ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యం కారణంగా తెలియకుండానే ఆవేశంగా మాట్లాడుతారు. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని వీలైనన్నిసార్లు పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఊరటగా ఉంటుంది. ఒత్తిడులను అధిగమిస్తారు. అధికారులతో ఉండే గొడవలను పరిష్కరించుకుంటారు. ప్రేమలు, ద్వితీయ వివాహ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఈ వారం సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకాలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంచనాలు తారుమారవుతాయి. మానసిక, శారీరక ఒత్తిడి పెరుగుతుంది. తెచ్చిపెట్టుకున్న ధైర్యం, నామమాత్రపు నవ్వు ఉంటుంది తప్ప.. సహజత్వం ఉండదు. కీలకమైన విషయాలపై దృష్టిసారించేందుకు ఈ వారం అంత అనుకూలం కాదు. ఈ వారం బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రశాంతంగా ఉంటారు. ఎవరేమనుకున్నా.. మీ బాగు మీరు చూసుకుంటారు. కావాలసిన దానికోసం ఎంతదూరమైనా వెళ్తారు. అధికారులు ఏమన్నా అన్నా ఉద్యోగులు పట్టించుకోరు. పెద్దగా ఇబ్బందులుండవు. ఈ వారం సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం కలసివస్తుంది. కుజుడి బలం తక్కువగా ఉండటంతో అనవసరమైన తగాదాలుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. తప్పు చేసినా కాపాడేవారు పక్కనే ఉంటారు. సహకరించే వర్గం చేరువలో ఉంటారు. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. స్థిరాస్తుల కొనుగోళ్లలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం శత్రుబలాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. చాపకింద నీరులా ఇబ్బంది పెట్టేవారిని కనుగొంటారు. నూతన వైద్యానికి అనుకూలం. వృత్తి, ఉద్యోగాల పరంగా కీలకనిర్ణయాలకు అనుకూలం కాదు. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సంకష్ఠహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం మొండి ధైర్యం ఉంటుంది. మసిపూసి మారేడుకాయ చేయడం అన్నట్టుగా ఉంటారు తప్ప.. సంతృప్తిగా ఉండరు. క్రెడిట్ కార్డు వినియోగాన్ని తగ్గించుకోవాలి. విపరీతంగా విసిగించేవారి నుంచి దూరంగా ఉండాలనుకుంటారు కానీ సాధ్యం కాదు. ఒత్తిడి పెరుగుతుంది. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. ఆరోగ్యంగా ఇబ్బందులుండవు. ఖర్చులు పెరిగినా ఉపయోగకరంగా ఉంటాయి. గౌరవ మర్యాదలుంటాయి. ప్రేమలు వివాదాస్పమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. గతించిన వారి జ్ఞాపకాలు వేధిస్తాయి. రకరకాల వ్యాపకాలతో గడిపేస్తారు. ఈ వారం సోమ, మంగళ వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
Next Story