Sun Dec 22 2024 16:01:40 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 26 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. కెరియర్ పరంగా అనుకూలంగా ఉంటుంది.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, సోమవారం
తిథి : శు.అష్టమి రా.2.02 వరకు
నక్షత్రం : ఉత్తర ఫల్గుణి మ.12.40 వరకు
వర్జ్యం : సా.9.45 నుండి 11.29 వరకు
దుర్ముహూర్తం : మ.12.45 నుండి 1.37 వరకు, ప.3.21 నుండి 4.13 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : సా.5.00 నుండి 5.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు క్రయవిక్రయాలు కలసివస్తాయి. గుర్తింపును కోరుకుంటారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేందుకు చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. అధికారులతో సంప్రదింపులు, ఇబ్బందులను పరిష్కరించుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నింటా జాగ్రత్త పాటించడం మంచిది. దూకుడు తనాన్ని తగ్గించుకోవాలి. తగాదాలు పెరుగుతాయి. వృథా ఖర్చులు ఎక్కువవుతాయి. పనులను వాయిదా వేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా చేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. అలసట పెరుగుతుంది. పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. రొటేషన్లు సానుకూలంగా సాగుతాయి. ఉద్యోగులు బద్ధకంగా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. ఎదుటివారిని ఒప్పించేందుకు చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. మాటతీరులో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. అయినవారి దగ్గర కూడా రహస్యాలను మెయింటేన్ చేయాలి. స్నేహాలు, పరిచయాలు ఉపయోగపడవు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు పనులను పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రయాణాలు, విహారయాత్రలు ఆనందాన్నిస్తాయి. ఇంట, బయట పనుల ఒత్తిడితో అలసిపోతారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. వృథా ఖర్చులుంటాయి. చేసేపనికంటే వచ్చే ఫలితాలు నామమాత్రంగా ఉండటంతో తృప్తిలోపం ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శారీరక అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. కెరియర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. శారీరకంగా, మానసికంగా విశ్రాంతి దొరుకుతుంది. ప్రయాణాలు, విహారయాత్రలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెళ్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఉద్యోగులకు సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. వ్యాపారస్తులకు రొటేషన్లు బాగుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. దృష్టిదోషం, శత్రుబలం పెరుగుతుంది. పూర్తి చేయాల్సిన పనుల్లోనే జాప్యం ఉంటుంది. ఎదురుదెబ్బలు తగులుతాయి. రేపుకు రూపు లేదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘగౌరవం పెరుగుతుంది. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. చర్చలు ఫలిస్తాయి. శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
Next Story