Mon Dec 23 2024 02:31:16 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 2 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు అధికమవుతున్నాయి.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్రవారం
తిథి : శు.త్రయోదశి మ.12.43 వరకు
నక్షత్రం : స్వాతి ఉ.6.51 వరకు
వర్జ్యం : మ.12.18 నుండి 1.52 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.20 నుండి 9.12 వరకు, మ.12.39 నుండి 1.31 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.2.10 నుండి 2.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చలాకీగా ఉంటారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలుంటాయి. క్రయవిక్రయాలు కలసివస్తాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. లౌక్యంగా వ్యవహరిస్తారు. ఎవరివద్ద ఎలా మాట్లాడాలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో ఏమరపాటు పనికిరాదు. ఏడిపించే వారు పక్కనే ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు పనివేళలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు లేత వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు అధికమవుతున్నాయి. ఎదుటివారు మాట్లాడేదానితో ఏకీభవించరు. పనులు వాయిదా పడతాయి. రిజిస్ట్రేషన్లలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం ఉంటుంది. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ప్రేమలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మాటపట్టింపులు చోటుచేసుకుంటాయి. అనవసమైన శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఊరికే అలసిపోతారు. ఆరోగ్యంపట్ల శ్రద్ధగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన విషయాలు తెలుసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు చదువుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. రాత్రివేళలో నిద్రను ప్రాముఖ్యతనివ్వాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ప్రేమలు ఫలిస్తాయి. లాయర్ సంప్రదింపులు సానుకూలమవుతాయి. నేర్పుగా వ్యవహరిస్తారు. వాహన కొనుగోళ్లు, పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి. సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఎదుటివారిని అర్థం చేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఖర్చులుంటాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పరంగా వెసులుబాటు ఉంటుంది. కాంట్రాక్ట్ రంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో ఏమరపాటుతనం పనికిరాదు. ప్రతివిషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కీలక నిర్ణయాలు, పనులు వాయిదా వేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
Next Story