Mon Dec 23 2024 03:01:22 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 3 : నేటి పంచాగం, ఈ రాశివారికి శత్రుబలం పెరుగుతుంది
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మాటివ్వడానికి..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శనివారం
తిథి : శు.చతుర్దశి ఉ.11.13 వరకు
నక్షత్రం : విశాఖ ఉ.6.14 వరకు
వర్జ్యం : ఉ.10.02 నుండి 11.34 వరకు
దుర్ముహూర్తం : ఉ.5.44 నుండి 7.28 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : సా.6.00 నుండి 6.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగవచ్చు. శత్రుబలం ఎక్కువగా ఉంటుంది. దృష్టి దోషాలు అధికమవుతాయి. ప్రయాణాలకు అనుకూలం కాదు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎదుటివారిని ఆకట్టుకుంటారు. మాటతీరుని కనబరుస్తారు. అధికారులను ఆకట్టుకుంటారు. ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. చర్చలకు సంబంధించిన అంశాలు కలసివస్తాయి. సూటిగా మాట్లాడుతారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనవసరమైన తగాదాలు, విబేధాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. వృథా ఖర్చులు అధికంగా ఉంటాయి. మంచికిపోతే చెడుఎదురైందన్నట్టుగా సంఘటనలు ఉంటాయి. పనివేళలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక లావాదేవీలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. సంతకానికి విలువైన ఉద్యోగంలో ఉన్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. మాటివ్వడానికి, తీసుకోడానికి ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మాటపట్టింపులు చోటుచేసుకుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. శత్రుబలం, దృష్టిదోషం పెరుగుతాయి. దంపతుల మధ్య తగాదాలు, విబేధాలు రావొచ్చు. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కొత్తవిషయాలు తెలుసుకుంటారు. ఆశించిన పెట్టుబడులు లభిస్తాయి. రుణాలు తీర్చే ప్రయత్నాలు ఫలిస్తాయి. తండ్రితో లేదా తండ్రి తరపు బంధువులతో తగాదాలు రావొచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. అన్నింటా జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న విశ్రాంతి ఉండదు. పనివేళలు పెరుగుతాయి. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చేసేపనిలో స్పష్టత ఉంటుంది. తీరని సమస్యల పరిష్కారానికి మంచి మార్గం కనిపిస్తుంది. మధ్యవర్తిత్వ పరిష్కారాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒత్తిడికి లోనవుతారు కానీ తట్టుకుని నిలబడతారు. ప్రతి విషయంలో విజయాలు సొంతం చేసుకుంటారు. ఉద్యోగులకు పనివేళలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అర్థం చేసుకునేవారి సంఖ్య తక్కువ. బంధువులతో విరోధం ఏర్పడవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story