Mon Dec 23 2024 02:48:27 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 5 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శారీరకంగా మానసికంగా అలసిపోతారు.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, సోమవారం
తిథి : బ.పాడ్యమి ఉ.6.38 వరకు, బ.విదియ రా.3.48 వరకు
నక్షత్రం : మూల రా.1.21 వరకు
వర్జ్యం : ఉ.11.53 నుండి 1.21 వరకు
దుర్ముహూర్తం : మ.12.40 నుండి 1.32 వరకు, మ.3.16 నుండి 4.08 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి మ.12.00 వరకు
శుభ సమయాలు : సా.4.30 నుండి 5.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సమాన ఫలితాలుంటాయి. ఆదాయ వ్యవయాలు, గౌరవ మర్యాదలు సమానంగా ఉంటాయి. అలసట పెరుగుతుంది. కీలక నిర్ణయాలకు అనుకూలం కాదు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ముఖ్యమైన పనులు మినహా మిగతా పనులను వాయిదా వేయడం మంచిది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కంటితో చూడనిదే దేనిని నమ్మకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు, విద్యార్థులకు అనుకూలం. ఖర్చులు పెరుగుతాయి. గృహ అలంకరణపై దృష్టిసారిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాలపై దృష్టిసారిస్తారు. మనసులో మాటను పంచుకునేందుకు ఆత్మీయులు ఉంటారు. అర్థబలం, అంగబలం కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయం వివాదాలతో ఉంటుంది. ఖర్చులు శృతి మించుతాయి. రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల విషయంలో ఏమరపాటు తగదు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనుల్లో కదలిక ఉండదు. ఎవరిని సహాయం కోరినా సరైన సమాధానం ఉండదు. రోజంతా అయోమయంగా సాగుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. గౌరవ, మర్యాదలను కలిగి ఉంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడేవారికి ఊరట లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శారీరకంగా మానసికంగా అలసిపోతారు. మంచి చెప్పినా చెడుగా అర్థం చేసుకుంటారు. ప్రయాణాల్లో ఏమరపాటు తగదు. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సెల్ఫ్ డెవలప్ మెంట్ పై దృష్టిసారిస్తారు. సేవింగ్స్ ను ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తారు. ఎవరైనా మాట్లాడినా చిరాకు పడతారు. అప్పులు తీర్చేందుకు, తీసుకునేందుకు అనుకూలం. సామాజిక స్పృహను కలిగి ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన తగాదాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. జీవిత భాగస్వామి అర్థంచేసుకోకపోవడంతో ఆవేదన చెందుతారు. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా సానుకూలంగా ఉంటుంది. ఏ తప్పు జరిగినా, ఇబ్బందులున్నా అది స్వయంకృతాపరాధమే అవుతుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు హడావిడిగా ఉంటారు. క్షణం కూడా వృథా చేయరు. ఆర్థికంగా లాభనష్టాలుండవు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. మీ సంతకానికి విలువ పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
Next Story