Mon Dec 23 2024 02:41:21 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 7 HOROSCOPE : నేటి పంచాగం, ఈ రాశులవారు రిస్క్ తీసుకోకపోవడం మంచిది
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు బద్ధకం పెరుగుతుంది. మనిషొక చోట మనసు మరోచోట అన్నట్టుగా ఉంటుంది
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బుధవారం
తిథి : బ.చవితి రా.9.51 వరకు
నక్షత్రం : ఉత్తరాషాఢ రా.9.02 వరకు
వర్జ్యం : ఉ.6.29 నుండి 7.56 వరకు, రా.12.49 నుండి 2.10 వరకు
దుర్ముహూర్తం : ఉ.11.48 నుండి 12.41 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.10 నుండి 9.40 వరకు, సా.3.50 నుండి 4.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎక్కువగా ఆలోచిస్తారు. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఫిర్యాదులకు, చర్చలకు అనుకూలం. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతుల్లో వెసులుబాటు లభిస్తుంది. ఆరోగ్యం పరంగా ఊరట ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. తక్కువగా మాట్లాడాలి. ఎవరికీ సలహాలివ్వరాదు. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. తప్పుపట్టినవారికి నిజాయితీ నిరూపించుకుంటారు. దంపతుల మధ్య తగాదాలు కొనసాగుతాయి. సంతానం విషయాలకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలపై దృష్టిసారిస్తారు. ముందుకు సాగాలన్న పట్టుదల కొనసాగుతుంది. వీలైనంత వరకూ డ్రైవింగ్ కు దూరంగా ఉండాలి. రహస్య శత్రువులను కనుగొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. ప్రేమికులు, దంపతుల మధ్య విభేదాలు రావొచ్చు. ఏమరపాటుతనానికి దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు బద్ధకం పెరుగుతుంది. మనిషొక చోట మనసు మరోచోట అన్నట్టుగా ఉంటుంది. తల్లితో మాటపట్టింపులు రావడం లేదా బెంగగా ఉండటం వంటివి ఉంటాయి. జరిగిపోయిన సంఘటనలను పదేపదే గుర్తు తెచ్చుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు లౌక్యంగా వ్యవహరిస్తారు. ఎవరితో ఎలా మాట్లాడితే పనులు పూర్తవుతాయో తెలుసుకుని మసులుకుంటారు. ఉద్యోగులకు అనుకూలం. కాంట్రాక్ట్ రంగం వారికి అనుకూలం. తలనొప్పి.. కండరాల నొప్పులు బాధిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. మాటపట్టింపులు చోటుచేసుకుంటాయి. అలసట పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఊహించిన మేర లాభాలుండవు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్తవిషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఉత్సాహంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. ఎవరేమన్నా పట్టించుకోరు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. రోజువారి కార్యక్రమాలపైనే దృష్టిసారించడం మంచిది. రిజిస్ట్రేషన్లలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. నిర్మొహమాటంగా విషయాలను చెప్తారు. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. రె్యులర్ కు భిన్నంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story