Mon Dec 23 2024 02:59:24 GMT+0000 (Coordinated Universal Time)
JUNE 9 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు విచిత్రమైన గ్రహస్థితి ఉంటుంది. అవునంటే ఒక సమస్య, కాదంటే మరో సమస్యగా ..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్రవారం
తిథి : బ.షష్ఠి సా.4.23 వరకు
నక్షత్రం : ధనిష్ఠ సా.5.11 వరకు
వర్జ్యం : రా.11.56 నుండి 1.26 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.20 నుండి 9.13 వరకు, మ.12.41 నుండి 1.33 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.2.00 నుండి 2.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఏ పని చేపట్టినా ఒడిదుడుకులు ఎదరవుతాయి. మోసపోయేందుకు అవకాశాలెక్కువ. ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గౌరవ, మర్యాదలు సమానంగా ఉంటాయి. చేయకూడదనుకున్న పనిని పూర్తి చేస్తారు. క్రయవిక్రయాలు వాయిదా వేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నింటా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. తప్పెవరిదైనా మీరే మాట పడతారు. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. పెళ్లి చూపులు, ప్రేమలు కలసివస్తాయి. చిన్న అప్పులు తీర్చేందుకు పెద్ద అప్పులు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గౌరవ, మర్యాదలు లభిస్తాయి. బంధువర్గంలో మీ మాటే చెల్లుబాటు అవుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలం. వ్యవసాయం, వ్యాపార రంగాలవారికి అనుకూలం. కాళ్లనొప్పులు, బీపీ వంటివి ఇబ్బంది పెడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు విచిత్రమైన గ్రహస్థితి ఉంటుంది. అవునంటే ఒక సమస్య, కాదంటే మరో సమస్యగా ఉంటుంది. అప్పుచేయక తప్పని పరిస్థితులు ఎదురవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. వృథాఖర్చులుంటాయి. విద్యార్థులు అధికంగా శ్రమించాలి. వాహనప్రమాదం జరగవచ్చు. అజీర్తి సమస్య వేధిస్తుంది. తప్పనిసరి పనులు మినహా మిగతా వాయిదా వేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సాహసోపేతంగా ముందుకు వెళ్తారు. ధైర్యే, సాహసే లక్ష్మి అనే సూత్రాన్ని నమ్ముకుని ఉంటారు. న్యాయవాదులను సంప్రదించేందుకు అవకాశాలెక్కువ. పనులు సాధించాలన్న పట్టుదలతో ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసికంగా, శారీరకంగా అలసిపోతారు. ఖర్చులు పెరుగుతాయి. ఎదుటివారు మాట్లాడుతుంటే వినకతప్పదు. రోజంతా చికాకుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రుణాలు తప్పకపోవచ్చు. అప్పులు తిరిగి వసూలు చేయడం కష్టతరంగా ఉంటుంది. వస్తుభద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నింటా అనుకూలం. ప్రతికూలమైన పరిస్థితులను అధిగమిస్తారు. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. ఆరోగ్యం పరంగా ఊరట లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకపచ్చ రంగు.
Next Story