Fri Nov 22 2024 21:57:02 GMT+0000 (Coordinated Universal Time)
JUNE HOROSCOPE : నేటి పంచాగం, జూన్ 1 నుండి 30 వరకూ రాశిఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ మాసం సాధారణ ఫలితాలుంటాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు పోటీ..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, గురువారం
తిథి : శు.ద్వాదశి మ.1.34 వరకు
నక్షత్రం : చిత్త ఉ.6.46 వరకు
వర్జ్యం : ప.12.23 నుండి 2.00 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.04 నుండి 10.56 వరకు, మ.3.15 నుండి 4.07 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : ఉ.9.00 నుండి 9.40 వరకు, సా.4.40 నుండి 5.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ మాసమంతా ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు లభిస్తుంది. సంఘంలో గౌరవం, పలుకుబడి కలిగి ఉంటాయి. ఇన్నాళ్లు ఉన్న సహనాన్ని వీడుతారు. శత్రుబలం తగ్గుతుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. శుభకార్యాల ప్రయత్నాలు కలసివస్తాయి. మాస ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ మాసం అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. తగాదాలు, విభేదాలు ఉన్నా.. సఖ్యత, ఐక్యత ఏర్పడుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొండల్లా వచ్చే కష్టాలు మబ్బుల్లా విడిపోతాయి. మిమ్మల్ని మీరు సముదాయించుకుంటారు. చేయలేని పనులను కూడా పూర్తిచేస్తారు. ప్రేమలు ఫలిస్తాయి. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. తిమ్మిరి బమ్మిరి చేసైనా అనుకున్నది సాధిస్తారు.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ మాసం అన్నివిధాలా సహకరిస్తుంది. కుజుడి బలం తక్కువగా ఉండటంతో ఖర్చులు అధికంగా ఉంటాయి. అందుకు తగిన రాబడి కూడా ఉంటుంది. ప్రతి విషయం తగాదాతో ముడిపడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్తమార్పులు వస్తాయి. దృష్టిదోషం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. రిజిస్ట్రేషన్ల కార్యక్రమాలు పూర్తిచేసుకోవడం మంచిది.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ మాసం అన్నివిధాలా సహకరిస్తుంది. జూన్ 16వ తేదీ వరకూ యోగదాయకంగా ఉంటుంది. ఆ తర్వాతి నుంచి కొత్త సమస్యలు ఏర్పడుతాయి. పనులు వాయిదా పడుతుంటాయి. అనవసరమైన సమస్యలు, వివాదాలు పెరుగుతాయి. బద్ధకంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కంప్లైంట్స్ ఉంటాయి. పక్కవారి పనికూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. నూతన వ్యాపారాలకు అనుకూలం కాదు.
పరిహారం : ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ మాసం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవం, పలుకుబడి పెరుగుతాయి. ఆర్థిక సర్దుబాట్లునేర్పుగా చేసుకుంటారు. శత్రుబలం తగ్గుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నేమ్ అండ్ ఫేమ్ ఉంటాయి. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు రావడం లేదా మంచి ప్యాకేజీ ఉన్న ఉద్యోగమార్పులు జరగవచ్చు. పాత, కొత్త పరిచయాలు ఉపయోగపడుతాయి. ప్రతివిషయంలో బద్ధకానికి దూరంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుదర్శనకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడంతో పాటు కుక్కకు ఏదైనా ఆహారం పెట్టడం మంచిది.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ మాసం అన్నివిధాలా సహకరిస్తుంది. పొరపొచ్ఛాలు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బంధువులతో ఏర్పడిన తగాదాలు, విభేదాలు సమసిపోతాయి. ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. నెల ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంటుంది. మనసుకి నచ్చిన ప్రదేశాలను సందర్శిస్తారు.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ మాసం కాస్త అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. 16వ తేదీ తర్వాత రవి అష్టమంలో నుంచి భాగ్యంలోకి వెళ్తాడు. అయినా పెద్దగా కలిసొచ్చే అంశాలేవీ లేవు. అనుకున్నంత వేగంగా లోన్లు తీర్చలేరు. ప్రయాణాలతో అలసిపోతారు. మీ మాటకు విలువ, గౌరవం తగ్గుతున్నాయనుకునే విధంగా సంఘటనలు చోటుచేసుకుంటాయి. వీలైనంత వరకూ మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా వ్యవహరించాలి. తక్కువగా మాట్లాడాలి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్నీ పారాయణ చేయాలి.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ మాసం ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. రిప్రజంటేటర్స్ గా ఉద్యోగం చేసేవారికి అనుకూలం. చివరి రోజుల్లోమాత్రం హడావిడిగా ఉంటుంది. శత్రుబలం పెరుగుతుంది. వీలైనంతవరకూ వాహనాలు నడపకపోవడం మంచిది. ఒకటికి నాలుగుసార్లు ప్రయత్నిస్తే తప్ప శుభకార్యాలు సానుకూలపడవు.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్నిసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ మాసం ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. అధికారుల మెప్పు పొందుతారు. ఆరోగ్యపరంగా ఊరట, వెసులుబాటు లభిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత ఒడిదుడుకులుగానే కొనసాగుతుంది. అర్థంచేసుకునే వారి సంఖ్య తగ్గుతుంది. నూతన వాహనం లేదా గృహ కొనుగోళ్ల ప్రయత్నాలకు అడ్డంకులుంటాయి. ఎవరేమనుకున్నా మీకు నచ్చినట్టు ఉండాలన్న ఆలోచనలు బలపడుతాయి.
పరిహారం : ప్రతిరోజూ అర్జునకృత దుర్గాస్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేసి, దుర్గా అమ్మవారిని పూజించాలి.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ మాసం వృత్తి, ఉద్యోగాల పరంగా జాగ్రత్తలు అధికమవుతాయి. ఊహించని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతాయి. విద్యార్థులు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. కష్టాలెక్కువ.. ఫలితం తక్కువగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలతో నష్టపోతారు. అనుభవం ఉన్నవాటిపై మాత్రమే దృష్టిసారించడం మంచిది.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రం, శివకవచ స్తోత్రాన్నీ పారాయణ చేయాలి.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ మాసం సాధారణ ఫలితాలుంటాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు పోటీ పెరుగుతుంది. ఖర్చులు ఎంతుంటాయో ఆదాయం కూడా అందుకు తగ్గట్టుగా ఉంటుంది. ఒత్తిడి, అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అన్నింటా ఆచితూచి వ్యవహరించాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మొండితనం కూడా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్యహృదయ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ మాసం వృత్తి, ఉద్యోగాల్లో వెసులుబాటు లభిస్తుంది. శుభకార్యాల్లో తొందరపాటు తనం మంచిదికాదు. ఏం జరిగినా మంచికే అనుకోవాలి. వినే ఓపిక తగ్గుతుంది. శుభకార్యాల విషయాల్లో పట్టు-విడుపు గా ఉండాలి. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. శుభవార్తలు వింటారు. కొత్తపరిచయాలు ఉపకరిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్రమనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. మంగళవారం దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయాలి.
Next Story