Fri Nov 22 2024 19:37:13 GMT+0000 (Coordinated Universal Time)
Maha Shivaratri : మహాశివరాత్రి రాశిఫలాలు.. ఈరోజున మీ రాశిఫలం ఎలా ఉందో తెలుసుకోండి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఎదుటివారితో బేధాభిప్రాయాలు ఏర్పడుతాయి. ఆవేశంలో నిర్ణయాలు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, గురువారం
తిథి : బ. త్రయోదశి రా.8.02 వరకు, తదుపరి బ.చతుర్ధశి
నక్షత్రం : ఉత్తరాషాఢ సా.5.42 వరకు
వర్జ్యం : రా.9.12 నుండి 10.36 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.36 నుండి 8.08 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.45 నుండి 11.36 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలుంటాయి. వీలైనంతవరకూ గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఎదుటివారితో మాట్లాడేటపుడు ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు శివునికి నీళ్ళు సమర్పించిన తర్వాత 'ఓం నాగేశ్వరాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తలు అవసరం. కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కొరవడుతుంది. మానసిక ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలుంటాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నా.. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఈ రోజు శివలింగానికి పాలు సమర్పించిన తర్వాత 51 సార్లు 'ఓం నమఃశివాయ్' అని జపించాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఇంట, బయట చికాకులు పెరుగుతాయి. పనుల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం. ఒత్తిడులను నేర్పుగా అధిగమిస్తారు. ఈ రోజు శివుని రుద్రాష్టకంతో 'ఓం నమః శివాయ కాలం మహాకాల కాలం కృపాలం ఓం నమః' అనే మంత్రాన్ని పఠించాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వస్తులాభం కలుగుతుంది. కుటుంబ అవసరాల నిమిత్తం ఖర్చు చేస్తారు. కుటుంబ సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. నూతన వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు శివునికి ఆవు పాలను నైవేధ్యంగా పెట్టి శివ చాలీసాను అత్యంత భక్తిశ్రద్ధలతో పఠించాలి.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని పనుల్లో విజయం వరిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగ, వ్యాపారస్తులు మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మహాదేవుడికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించిన తర్వాత.. శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఎదుటివారితో బేధాభిప్రాయాలు ఏర్పడుతాయి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం తగదు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఒత్తిడుల నుంచి విముక్తి ఉంటుంది. ప్రయాణాలు కలసివస్తాయి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ వహిస్తారు. ఈ రోజు 'ఓం నమో శివాయ కాలం ఓం నమః' అనే మంత్రాన్ని పైకి ఉచ్ఛరిస్తూ జపించాలి.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పనిలో చికాకులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన మేర ఫలితాలు ఉండకపోవచ్చు. కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు శివారాధన చేస్తూ.. శివపంచాక్షరి మంత్రాన్ని జపించాలి.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కుటుంబ చికాకులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. పనుల్లో ఒత్తిడులున్నా.. అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఈ రోజు 'ఓం పార్వతీ నాథాయ నమః' అనే మంత్రాన్ని 51 సార్లు జపించాలి.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలుంటాయి. వీలైనంత వరకూ గొడవలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు రుద్రాష్టకం స్తుతి చదవాలి. శివునికి నీటిని సమర్పించేటప్పుడు 'ఓం అంగరేశ్వరాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఒత్తిడులు పెరుగుతాయి. ఖర్చుల నియంత్రణ కోల్పోతారు. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు చికాకులు పెరుగుతాయి. ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ రోజు శివునికి చందనాన్ని పూసిన తర్వాత 'ఓం భమేశ్వరాయ నమః' అనే మంత్రాన్ని 51 సార్లు జపించాలి.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూల ఫలితాలుంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ప్రతి పనిలోనూ సానుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగ, వ్యాపారస్తులకు కలసివస్తుంది. ఈ రోజు శివునికి పాలు, పెరుగు, తేనె సమర్పించిన తర్వాత 108 సార్లు 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని జపించాలి.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. పనుల్లో చికాకులు ఉంటాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. మానసిక ఒత్తిడి ఇబ్బంది పెడుతుంది. ముఖ్యమైన పనులు మినహా మిగతా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు శివాలయంలో కూర్చుని, శివునికి ధాతురా, భాంగ్ నైవేద్యంగా సమర్పించిన తర్వాత శివాష్టకాన్ని పఠించడం మంచిది.
Next Story