Mon Dec 23 2024 16:49:20 GMT+0000 (Coordinated Universal Time)
మహిషాసుర మర్దినిని పూజిస్తే ఎలాంటి సమస్యలు తొలగుతాయి ? నేటి ద్వాదశ రాశుల ఫలితాలు
సంవత్సరమంతా పూజిస్తే ఎంత పుణ్యమో.. ఈ ఒక్కరోజు పూజిస్తే అంత ఫలితం ఉంటుంది. నేడు అమ్మవారిని పూజించడం వల్ల..
దేవి నవరాత్రుల్లో .. గడిచిన 8 రోజులు అమ్మవారికి పూజ చేయని వారు.. ఈ రోజు మహర్నవమి ఉపవాసం ఉండి, ముత్తైదువును దేవీ స్వరూపంగా భావించి తాంబూలం ఇవ్వడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మహిషాసుర మర్దిని దేవిని పూజించడం వల్ల శత్రబాధలు తొలగుతాయి. సంవత్సరమంతా పూజిస్తే ఎంత పుణ్యమో.. ఈ ఒక్కరోజు పూజిస్తే అంత ఫలితం ఉంటుంది.
నేడు అమ్మవారిని పూజించడం వల్ల కేతుగ్రహ దోషాలు తొలగిపోతాయి. మానసిక రుగ్మతలు, పీడ కలలు వంటి దోషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత ఆరోగ్యం చేకూరుతాయి. కుంకుమ పూజ చేయడం మంచిది. నిమ్మకాయల దండ వేసి, అమ్మవారికి బెల్లపు పరమాన్నం (చక్కెరపొంగలి)ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ పర్వదినం రోజు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం
తిథి : శు.నవమి సా.మ.2.20 వరకు
నక్షత్రం : ఉత్తరాషాఢ రా.10.51 వరకు
వర్జ్యం : ఉ.7.54 నుండి 9.23 వరకు
రా.2.35 నుండి 4.05 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.23 నుండి 9.10 వరకు
రా.10.43 నుండి 11.32 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈరోజు పనులు వాయిదా పడుతుంటాయి. ప్రతివిషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి. శుభవార్తలు వింటారు. ఈరోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు సాధారణ ఫలితాలుంటాయి. శతృబలం, దృష్టి దోషం అధికంగా ఉంటాయి. పనులు వాయిదా పడతాయి. అంచనాలు తారుమారవుతాయి. ఈరోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు క్రయ విక్రయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలపై దృష్టిసారిస్తే మెరుగైన ఫలితాలుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఈరోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఆర్థిక విషయాలు కలసివస్తాయి. భార్య-భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులనైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి సానుకూలంగా ఉంటుంది. నేడు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు పనులు వాయిదా పడుతుంటాయి. నిద్రాహారాలు లోపిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఈరోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ఇంటా, బయట గౌరవం పెరుగుతుంది. ఈరోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఖర్చులు అధికమవుతాయి. ప్రయాణాల్లో ప్రయాస ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. సంతానం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈరోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పనుల్లో నిరుత్సాహం. ఈరోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు గాయాలయ్యే అవకాశాలున్నాయి. భార్య-భర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు మాట విబేధాలు రావొచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలం. రాజకీయ, కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీనం
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలపై ఆలోచన పెరుగుతుంది. స్థల కొనుగోళ్లలో అడుగు ముందుకు పడుతుంది. ఈరోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story