Tue Dec 24 2024 18:25:04 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 10 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత ఖర్చులు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్రవారం
తిథి : బ.తదియ రా.9.42 వరకు
నక్షత్రం : చిత్త పూర్తిగా..
వర్జ్యం : మ.2.22 నుండి 4.03 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.45 నుండి 9.32 వరకు, మ.12.42 నుండి 1.29 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.1.40 నుండి 2.20 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రిటైర్డ్ అయ్యాక కూడా చేసే ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. చిరువ్యాపారస్తులకు అనుకూలం. సమస్యల పరిష్కారం గురించి ఆలోచిస్తే.. మంచి ఆలోచనలు తడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాతి నుంచి కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకోవడం మంచిది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. ఖర్చులు ఉపకరిస్తాయి. ఇంటి అలంకరణపై దృష్టి సారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆగిపోయిన పనుల్లో కదలికలకోసం ప్రయత్నిస్తారు. సెంటిమెంట్ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకు మాత్రమే అనుకూలం. తర్వాతి నుంచి పనులు వాయిదా పడతాయి. నిరుత్సాహంగా ఉంటారు. గడిచిన సంఘటనలు పదే పదే గుర్తుకొస్తాయి. నిద్రాహారాల విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి లేదా ఆమెతరపు బంధువులతో మాట్లాడకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుంచి అనుకూలంగా ఉంటుంది. దేనినీ మనసుకు తీసుకోకపోవడం మంచిది. ఎవరికైనా మనసులో మాటలు చెప్పే ఆలోచనలు ఉంటే.. సాయంత్రం వరకూ ఆగాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకు మాత్రమే అనుకూలం. ఏ పనులైనా ఆ లోగా పూర్తిచేసుకోవాలి. 12 గంటల తర్వాత ఖర్చులు పెరుగుతాయి. మంచికిపోయి చెడును తెచ్చుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాతి నుంచి అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం కాస్త నలతగా ఉంటుంది. మానసిక, శారీరక శ్రమ పెరుగుతుంది. ఎవరినీ నమ్మొద్దు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. కెరియర్ పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ పరమైన అంశాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూల ఫలితాలుంటాయి. అన్ని వసతులు సమకూరుతాయి. ప్రశాంతంగా ఆలోచిస్తారు. మానసిక ప్రశాంతతకు సంతానం కారణమవుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్దగా ఒడిదుడుకులుండవు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఒడిదుడుకులుండవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12.30 తర్వాత కాలం వ్యతిరేకంగా ఉంటుంది. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిది. ఓవర్ కాన్ఫిడెన్స్ తో లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
Next Story