Tue Dec 24 2024 18:08:11 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 11 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయంలోనూ జాప్యం ఎక్కువగా ఉంటుంది. పనుల్లో కదలికలు వేగంగా ఉండవు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శనివారం
తిథి : బ.చవితి రా.10.05 వరకు
నక్షత్రం : చిత్త ఉ.7.11 వరకు
వర్జ్యం : మ.12.58 నుండి 2.38 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.22 నుండి 7.57 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.40 నుండి 11.20 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. స్వలాభం గురించి ఆలోచిస్తారు. అందంపై మమకారం పెరుగుతుంది. ఉద్యోగులు మంచి విజయాలు సాధిస్తారు. కళ, సాహిత్య రంగాలవారికి అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు ముమ్మరమవుతాయి.ప్రేమలు ఫలిస్తాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులకు పెద్దగా ఒడిదుడుకులుండవు. దంపతుల మధ్య తగాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయినవారితోనే తగాదాలు రావొచ్చు. ఆర్థికంగా జాగ్రత్తలు వహించాలి. నమ్మినవారే మోసం చేసే అవకాశాలు ఎక్కువ. పనుల విషయంలో సతమతమవుతారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వింతగా గడుస్తుంది. గట్టిగా మాట్లాడితే తిడతాడు. నిదానంగా మాట్లాడితే పట్టించుకోవడం లేదంటారు. ఏం చేయాలో తెలియ అయోమయంలో పడతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాలు సానుకూలంగా సాగుతున్నాయి. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న విషయాలపై మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయంలోనైనా దాపరికాన్ని పాటించాలి. తప్పు ఎవరో చేస్తే మీరు మాట పడాల్సిన పరిణామాలు ఎదురవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్తవిషయాలు తెలుసుకుంటారు. లౌక్యంగా పనులు పూర్తి చేయించుకుంటారు. విహర యాత్రలు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయం రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయంలోనూ జాప్యం ఎక్కువగా ఉంటుంది. పనుల్లో కదలికలు వేగంగా ఉండవు. ఆర్థికపరంగా ఆచితూచి వ్యవహరిచాలి. అప్పులు చేయడానికి, ఇవ్వడానికి దూరంగా ఉండటం మంచిది. కీలక నిర్ణయాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ స్పష్టత వస్తుంది. ఉపయోగకరమైన ఖర్చులే అయినా.. నియంత్రణ ఉండదు. నదులు, సముద్ర స్నానాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. కెరియర్ బాగుంటుంది కానీ ఆలోచించే విధానంతో ఇబ్బంది పడతారు. శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలపడతాయి. మనసులోని మాటలను నిర్భయంగా చెప్తారు. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు విచిత్రంగా ఉంటుంది. అవుతుందనుకున్న పని ఆగిపోతుంది. ఆగిపోతాయనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఆట, పాటల్లో తెలియకుండా దెబ్బలు తగులుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహాలు ప్రతికూలంగా ఉండటంతో తప్పు ఎవరిదైనా అపవాదుమాత్రం మీ పైనే పడే అవకాశాలు ఎక్కువ. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
Next Story