Fri Nov 22 2024 20:56:10 GMT+0000 (Coordinated Universal Time)
WEEKLY HOROSCOPE : ఈ వారం ఈ రెండు రాశుల వారికి కుజస్తంభన దోషం తొలగిపోతుంది
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. దంపతుల మధ్య అనవసరమైన బేధాలు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, ఆదివారం
తిథి : బ.పంచమి రా.10.01 వరకు
నక్షత్రం : స్వాతి ఉ.8.00 వరకు
వర్జ్యం : రా.1.41 నుండి 10.473.18 వరకు
దుర్ముహూర్తం : సా.4.38 నుండి 5.26 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.8.35 నుండి 9.20 వరకు
నవగ్రహ సంచారం
మేషం -రాహువు
మీనం, మేషం - శుక్రుడు
వృషభం, మిథునం - కుజుడు
తుల - కేతువు
కుంభం - బుధుడు, శని
కుంభం, మీనం - రవి
మీనం - గురువు
చంద్రగ్రహ సంచారం
తుల, వృశ్చికం, ధనస్సు, మకరం
మార్చి 12 నుండి మార్చి 18 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూల ఫలితాలుంటాయి. ఏ విషయంలోనూ కొరత ఉండదు. కానీ శ్రమ పెరుగుతుంది. శుభకార్యాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం పై దృష్టిసారిస్తారు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ వారం ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. అందుకు తగిన ప్రతిఫలాలను పొందుతారు. ఇబ్బందులు పెరుగుతాయి. నేనేంటో నిరూపిస్తాననే శపథాలు చేస్తారు. పిత్రార్జిత అమ్మకాలకు సానుకూలం. ఖర్చుల నియంత్రణలో వైఫల్యం చెందుతారు. కోపాన్ని తగ్గించుకోవాలి. ఈ వారం ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. దంపతుల మధ్య అనవసరమైన బేధాలు ఏర్పడుతాయి. ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటారో అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే ఎదుటివారితో మాట్లాడేటపుడు ఆచితూచి వ్యవహరించాలి. జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుకు దూరంగా ఉండాలి. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురు వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. అలాగే మంగళవారం ఆంజనేయస్వామిని పూజించాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. గ్రహస్థితిలో సహకరించే గ్రహాల సంఖ్య తగ్గుతుండటంతో ఖర్చులు విపరీతంగా ఉంటాయి. దృష్టిదోషం పెరుగుతుంది. శత్రుబలం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. తల్లిదండ్రులతో కొట్లాటలకు దూరంగా ఉండాలి. నిదానమే ప్రధానంగా వ్యవహరిస్తే సానుకూల ఫలితాలుంటాయి. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. వీలైనన్నిసార్లు హనుమాన్ చాలీసాను పఠించాలి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూల ఫలితాలుంటాయి. రాశ్యాధిపతి అయిన రవి అనుకూలత తక్కువగా ఉండటంతో.. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. చేసేపనిలో తృప్తి ఉండదు. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఉంటుంది. పెండింగ్ పనుల్లో కదలికలు ఉంటాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. నూతన గృహ, వాహన కొనుగోళ్లు సానుకూలపడతాయి. ఈ వారం ఆది, శుక్ర వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. లాభ నష్టాలుండవు. ఊహలకు రెక్కలొచ్చినట్టు ఉంటుంది. పనులు ఆలోచనలకే పరిమితమవుతాయి తప్ప కార్యరూపం దాల్చవు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. విహార యాత్ర చేస్తారు. జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. తెలియని మానసిక ఆందోళన మాత్రం పోదు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. స్త్రీలతో తగాదాలు జరగవచ్చు. ఈ వారం సోమ, మంగళ వారాలు అనుకాలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం కుజస్తంభన దోషం తొలగిపోతుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కెరియర్ పై దృష్టిసారిస్తారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. చిరునవ్వు తగ్గుతుంది. ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. చిన్న చిన్న విషయాలను సైతం భూతద్దంలో చూడటాన్ని తగ్గిస్తే మంచి జరుగుతుంది. ఈ వారం ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శివ కవచ స్తోత్రాన్ని పారయణ చేయడం మంచిది. అలాగే తులసికోటలో ఉండే మట్టిని తిలకంగా ధరించాలి.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూల గ్రహస్థితి తగ్గుతుంది. చంద్రుడి బలం అనుకూలంగా ఉండటంతో.. నిరుత్సాహంగా ఉండరు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సహకరించిన వర్గం ఇకపై తిరగబడటాన్ని చూస్తారు. మీకు నష్టం చేకూర్చేవారిని దూరంగా ఉంచాలన్నా సాధ్యం పడదు. వాహన ప్రమాదాలు జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని యథాశక్తిగా పూజించాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. వివాహాది శుభకార్యాల విషయాల్లో తొందరపాటు తనం పనికిరాదు. బాధ్యతలకు అధిక ప్రాధాన్యమివ్వాల్సిన సమయం. పెట్టుబడులను వాయిదా వేయడం మంచిది. ఈవారమంతా కీలకమైన విషయాలపై దృష్టి పెట్టకపోవడం మంచిది. ఈ వారం ఆది, బుధ, గురు వారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చిరువ్యాపారస్తులకు కాలం అనుకూలం. ఎదుటివారికి లొంగి ఉండక తప్పదు. గౌరవ, మర్యాదలు తగ్గినా పట్టించుకోకుండా పనులపై దృష్టిసారిస్తారు. ఈ వారం ఆది, సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయాలి.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం కుజస్తంభన తొలగిపోతుంది. పనుల్లో కదలికలు ఏర్పడుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.క్రయ, విక్రయాల్లో సానుకూలతలు ఏర్పడుతాయి. భార్య, భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సహకరించే వర్గం చేరువలో ఉంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురు వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. అర్థాష్టమ కుజదోషం ప్రారంభమవుతుంది కాబట్టి.. ఆర్థిక విషయాల్లో పట్టు, విడుపుగా వ్యవహరించాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. నూతన వాహనాల కొనుగోలుకు అనుకూలం కాదు. అప్పులు ఇవ్వడం, తీసుకోవడానికి దూరంగా ఉండాలి. రిస్క్ లేని పనులపై మాత్రమే దృష్టిసారించాలి. ఈ వారం బుధ, గురు, శుక్ర, శని వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. అలాగే మంగళవారం ఆంజనేయస్వామికి 108 తమపాకులతో అర్చన చేయించుకోవాలి.
Next Story