Tue Dec 24 2024 18:13:40 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 14 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకోని ప్రయాణాలు ఎదురవుతాయి. అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శనివారం
తిథి : బ.సప్తమి రా.8.22 వరకు
నక్షత్రం : అనురాధ ఉ.8.13 వరకు
వర్జ్యం : మ.1.40 నుండి 3.13 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.43 నుండి 9.30 వరకు, రా.11.04 నుంచి 11.54 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.12.35 నుండి 1.15 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎదుటివారితో మాట పట్టింపులు చోటుచేసుకోవచ్చు.ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సరదాగా సాగాల్సిన కాలం నిరుత్సాహపరచవచ్చు. ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరించాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నూతన అవకాశాలు కలసివస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. పనుల్లో వేగం పెరుగుతుంది.ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. మధ్యవర్తిత్వం ద్వారా పనులు పూర్తవుతాయి. ఎదుటివారితో మాట్లాడేటపుడు రహస్యాలు తెలుసుకుంటారు. ప్రయాణాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఎదుటివారిని అర్థం చేసుకుంటారు. సహాయ సహకారాలు అందిస్తారు. రిజిస్ట్రేషన్లు సజావుగా పూర్తవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో వారితో మనస్ఫర్థలు ఏర్పడవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. అర్థం చేసుకునే వారు తక్కువగా ఉంటారు. తగాదాపడితే తప్ప పూర్తికాని పనులపై దృష్టిసారించాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయం కలసివస్తుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అందంపై మమకారం పెరుగుతుంది. శత్రుబలం తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. మాట పట్టింపులు అధికంగా ఉంటాయి. వీలైనంత తక్కువగా మాట్లాడటం మంచిది. ఎదుటివారి నుంచి సహాయ సహకారాలు అందవు. కష్టపడితే తప్ప ఫలితాలుండవు. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. కెరియర్ పై దృష్టిసారిస్తారు. పొదుపు చేసిన సొమ్ము అక్కరకు వస్తుంది. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకోని ప్రయాణాలు ఎదురవుతాయి. అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. దంపతుల మధ్య తగాదాలు తప్పవు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా, వృత్తిపరంగా, ఉద్యోగ రీత్యా మంచి ఫలితాలుంటాయి. అపార్థాలు తొలగిపోతాయి. ప్రతి విషయంలో ఎంతోకొంత మేలు జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కెరియర్ పై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. కాంట్రాక్ట్ రంగాల వారికి కలసివస్తుంది. శరీరం అలసిపోతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. సహకరించేవారు తక్కువగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story