Tue Dec 24 2024 18:26:24 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 16 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో డబ్బులిచ్చి రాబట్టుకునే ప్రయత్నాలు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, గురువారం
తిథి : బ.నవమి సా.4.39 వరకు
నక్షత్రం : మూల ఉ.4.24 వరకు, పూర్వాషాఢ తె.4.47 వరకు
వర్జ్యం : మ.3.21 నుండి 4.51 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.17 నుండి 11.05 వరకు, మ.3.03 నుండి 3.51 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : ఉ.9.00 నుండి 10.00 వరకు, సా.5.00 నుండి 6.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు సజావుగా సాగుతాయి. విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహంగా కొనసాగుతాయి. మనసుకి ఆవేదన కలిగేలా కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయి. రాజకీయ, కళా, సాహిత్య, క్రీడా రంగాల్లో ఉండేవారు అధికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడులను వాయిదా వేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నుంచి ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఏదొకటి సాధించాలన్న ఆలోచనలు బలపడతాయి. వ్యాపారస్తులకు కలసివస్తుంది. ఇతర ఇన్ కమ్ కోసం ప్రయత్నించేవారికి కలసివస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఏ పని చేయాలన్న అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఆర్థికంగా లాభ, నష్టాలుండవు. ఎదుటివారిని మెప్పించేందుకు చేసే పనులు కలసివస్తాయి. వివాహాది, శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శారీరక శ్రమ ఎక్కువ, ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ముఖ్యంగా నా అనుకున్న వారితో మాట పడే అవకాశాలు ఎక్కువ. ఆర్థిక విషయాలు ఆచితూచి వ్యవహరించాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. క్రయవిక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో వారు ఏమరపాటుగా ఉండకూడదు. ఎదుటివారిపై పనులపై వాయిదా పడితే నష్టపోతారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో డబ్బులిచ్చి రాబట్టుకునే ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలుంటాయి. మాటతీరు బాగుంటుంది. లౌక్యంగా వ్యవహరిస్తారు. విదేశీయాన ప్రయత్నాలకు ఆటంకాలు తొలగిపోతాయి. అందంపై మమకారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. అపోహలకు తావెక్కువ. ఆర్థిక విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. శ్రమఎక్కువ, ఫలితాలు తక్కువ. మాటకు విలువ, గౌరవం తగ్గుతుందన్న సందర్భాలు ఎదురవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆశించిన మేర రుణాలు సానుకూలమవుతాయి. పిల్లలతో ఆడుకునేందుకు ఇష్టపడతారు. ఈరోజు పెద్దగా కష్టనష్టాలుండవు. రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులు అధిక శ్రద్ధను కనబరచాలి. ప్రతి విషయంలో డోలాయమానంగా ఉంటుంది. ఆర్థికంగా లాభనష్టాలుండవు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పనులను చక్కబెట్టుకుంటారు. క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కెరియర్ కు అధిక ప్రాముఖ్యతనిస్తారు. జీవితంలోఅందరూ అభివృద్ధి చెందుతుంటే మనమెందుకు ఒకచోటే ఉండిపోయామన్న ఆలోచనతో ఉంటారు. క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. అందంపై దృష్టి పెడతారు. నిర్మొహమాటంగా వ్యవహరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story