Tue Dec 24 2024 17:57:26 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 17 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు ఎక్కువ. ప్రయాస ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు అర్థం చేసుకోవడం..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్రవారం
తిథి : బ.దశమి మ.2.06 వరకు
నక్షత్రం : ఉత్తరాషాఢ తె.2.46 వరకు
వర్జ్యం : మ.12.07 నుండి 1.35 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.41 నుండి 9.29 వరకు, మ.12.40 నుండి 1.28 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.1.40 నుండి 2.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలుంటాయి. శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. మంచి గౌరవ, మర్యాదలు కలిగి ఉంటారు. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పరిచయాలు విస్తరిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువ. అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరేం చెప్పినా పట్టించుకోని ప్రయత్నాలు చేయాలి. కీలక నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వాహనయోగం ఉంటుంది. చక్కని ఆహారాన్ని స్వీకరిస్తారు. ఎదుటివారితో భావాలను పంచుకుంటారు. భవిష్యత్ కు సంబంధించి పెట్టుబడులు పెట్టే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చక్కని గౌరవ, మర్యాదలు లభిస్తాయి. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. దంపతుల మధ్య తగాదాలు, విభేదాలు తొలగిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రమేయం లేకుండానే తగాదాలు జరగవచ్చు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృథా ఖర్చులే ఎక్కువగా ఉండొచ్చు. క్రయవిక్రయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఊహాగానాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ప్రతి పనిలోనూ ఎవరి సహాయ, సహకారాలు లభించవు. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. శారీరకంగా, మానసికంగా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభ సమాచారాలు అందుకుంటారు, వృత్తి, వాణిజ్యం పరంగా సానుకూల ఫలితాలు అందివస్తాయి. వ్యాపారపరమైన చర్చలు సానుకూలమవుతాయి. అంతో ఇంతో మేలు జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ప్రతి విషయంలో రెండు ప్లాన్లను పెట్టుకోవాలి. పట్టు, విడుపుగా వ్యవహరించాలి. అపార్థాలకు అవకాశాలు ఎక్కువ. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఉత్సాహంగా ఉంటారు. మంచి ఆహారాన్ని తీసుకోగలుగుతారు. అన్నిరకాల సౌకర్యాలను సమకూర్చుకుంటారు. ఎదుటివారు సహకరిస్తారు. పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు ఎక్కువ. ప్రయాస ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు అర్థం చేసుకోవడం లేదన్న నిరుత్సాహం ఎదురవుతుంది. తెలీకుండానే పొరపాట్లు జరగవచ్చు. ఎదుటివారికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయామన్న బాధ పెరుగుతుంది. రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి. ప్రతివిషయంలోనూ పాజిటివ్ గా ముందుకు వెళ్లడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story