Tue Dec 24 2024 18:29:36 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 18 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆలోచనలు..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శనివారం
తిథి : బ.ఏకాదశి మ.11.13 వరకు
నక్షత్రం : శ్రవణం రా.12.29 వరకు
వర్జ్యం : ఉ.6.23 నుండి 7.50 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.17 నుండి 7.53 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : సా.5.30 నుండి 6.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూల ఫలితాలుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ముఠా రాజకీయాలకు దూరంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జాలిగుణం పెరుగుతుంది. ఎదుటివారికి సహాయ సహకారాలు అందిస్తారు. తగాదాలు పడితే తప్ప సానుకూలం కాని పనులపై దృష్టిసారించడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అష్టమంలో చంద్రగ్రహ సంచారం ఉండటంతో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు నిరుత్సాహంగా కొనసాగుతున్నాయి. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. కీలక విషయాల్లో నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆలోచనలు చురుగ్గా పనిచేస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలుంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఫైనాన్స్ రంగంలో వారికి మంచిఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చర్చలకు సంబంధించిన అంశాలు కలసివస్తాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వైద్య సంప్రదింపుల్లో అనుకూల ఫలితాలుంటాయి. రిజిస్ట్రేషన్లు సజావుగా పూర్తవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదా లేకుండా రోజు గడవదు. తప్పు ఎవరివైపు ఉన్నా మీరే జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మంచికెళ్తే చెడు ఎదురవుతుందన్న చందంగా ఉంటుంది. వృథా ఖర్చులుంటాయి. వేళకు నిద్రాహారాలుండవు. శారీరక, మానసిక శ్రమ అధికమవుతుంది. అర్థం చేసుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉన్నా తగిన ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. ఆర్థికంగా మరింత ఎదుగుదల ఉంటుంది. ఆర్థిక విషయాలపైనే ఎక్కువ దృష్టిపెడతారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. అర్థం చేసుకునేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఎదుగుదల కోసం ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉంటుంది. పిత్రార్జిత ఆస్తుల్లో క్లారిటీ వస్తుంది. ఉపయోగకరమైన ఖర్చులుంటాయి. బంధుమిత్రుల్లో గౌరవం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా ఉంటుంది. అప్పులివ్వడం, తీసుకోవడానికి దూరంగా ఉండాలి. కాంట్రాక్ట్ రంగంవారు జాగ్రత్తగా ఉండాలి.ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు, ఇంట్లోని సామాగ్రి కొనుగోలుకు, వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు, విదేశీ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story