Mon Dec 23 2024 02:58:28 GMT+0000 (Coordinated Universal Time)
WEEKLY HOROSCOPE : నేటి పంచాగం, మార్చి 19 నుండి మార్చి 25 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. రవి, బుధ, గురువు అష్టమంలో సంచరిస్తున్నా, కుజుడు, చంద్రుడి
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, ఆదివారం
తిథి : బ.ద్వాదశి ఉ.8.07 వరకు, బ. త్రయోదశి తె.4.55 వరకు
నక్షత్రం : ధనిష్ఠ రా.10.04 వరకు
వర్జ్యం : తె.4.32 నుండి 5.59 వరకు
దుర్ముహూర్తం : సా.4.39 నుండి 5.27 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.8.00 నుండి 9.00 వరకు
నవగ్రహ సంచారం
మేషం - శుక్రుడు, రాహువు
మిథునం - కుజుడు
తుల - కేతువు
కుంభం - శని
మీనం - రవి, బుధుడు, గురువు
చంద్రగ్రహ సంచారం
మకరం, కుంభం, మీనం, మేషం
మార్చి 19 నుండి మార్చి 25 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం శుక్రుడు, కుజుడు, శని సంపూర్ణ యోగాన్ని అందిస్తారు. కానీ రవి బలం తగ్గుతుండటంతో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు సమయం పడుతుంది. శ్రమ పెరుగుతుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక ఊరటనిస్తారు. ఎదుగుదల తగ్గుతుందనేలా సంఘటనలు ఎదురవుతాయి. వివాహాది శుభకార్యాలకు ఆటంకాలు తొలగిపోతాయి. విదేశీయాన ప్రయత్నాలు సానుకూలమవుతాయి. రహస్య శత్రువుల బలం పెరుగుతుంది. ఈ వారం సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. గతంలో కంటే ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. వ్యాపారస్తులకు రొటేషన్లు జరుగుతాయి. కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఎదుటివారి సహాయ,సహకారాలు అందవు. రిజిస్ట్రేషన్లు సజావుగా పూర్తవుతాయి. ఈ వారం సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం మంచిది. మంగళవారం ఆంజనేయస్వామిని పూజించడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం మెరుగ్గా ఉంటుంది. కెరియర్ పై దృష్టిసారిస్తారు. ఏ పనిలో ఎంత లాభం ఉంటుందన్న ఆలోచనలు చేస్తారు. తృప్తి తక్కువగా ఉన్నా పనుల్లో వేగం పెరుగుతుంది. తెలివితేటలు అక్కరకు వస్తాయి. శ్రమ అనుకూలంగా ఉంటుంది. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం మంచిది.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సహకరించే గ్రహాల సంఖ్య నామమాత్రంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శత్రుబలం పెరుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తికావు. దంపతుల మధ్య సఖ్యత లోపించడం, అనారోగ్యంగా ఉంటుంది. పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులున్నా గురుబలం కాపాడుతుంది. ఉద్యోగానికి రాజీనామా చేయడం మంచిది కాదు. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్నిసార్లు కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేసి, శునకానికి ఏదైనా ఆహారాన్ని పెడితే మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. రవి, బుధ, గురువు అష్టమంలో సంచరిస్తున్నా, కుజుడు, చంద్రుడి బలం సహకరిస్తాయి. మీ కష్టాన్ని మీరే చెప్పుకోవాల్సి వస్తుంది. ఆస్తిపంపకాలకు దూరంగా ఉండాలి. పిత్రార్జితాన్ని అమ్మితే ఇబ్బందులెదువుతాయి. ఏదొక అనారోగ్యంతో విసిగిపోతారు. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. ఈ వారం సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఇంట్లో తరచుగా జరిగే వివాదాలతో విసిగిపోతారు. ముక్కుమీద కోపం పనికిరాదు. సహోద్యోగులతో మాట పట్టింపులు ఏర్పడుతాయి. అనవసరమైన ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు. ఆర్థికంగా.. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఎంత జాగ్రత్త చేయాలనుకున్నా డబ్బు నిలవదు. రుణ ప్రయత్నాలు తప్పకపోవచ్చు. భార్య, భర్తల మధ్య అన్యోన్యత తగ్గకుండా జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువుల బాధ పెరుగుతుంది. దృష్టిదోషం అధికంగా ఉంటుంది. ఈ వారం సోమ, మంగళ, బుధవారాలు అనుకాలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం రవి, బుధ గ్రహాల బలం పెరుగుతుంది. గడిచిన రెండువారాల కంటే ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు అలసటను కలిగిస్తాయి. గౌరవ, మర్యాదలు కలిగి ఉంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రేమ పెళ్లిళ్లి, రెండో పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్ని ఎక్కువసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సహకరించే గ్రహాల సంఖ్య నామమాత్రంగా ఉంది. ఇబ్బంది పెట్టేవారు మీ పక్కనే ఉంటారు. క్రయవిక్రయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రూపాయిని కళ్లకద్దుకుని ఉండాలి. ఏ పని ఉన్నా రహస్యంగా ఉంచుకోవాలి. ఆఫీసుల్లో టీమ్ లీడ్ గా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. నూతన వ్యాపారాలకు అనుకూలం కాదు. ఇంట, బయట ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఈ వారం శుక్ర, శనివారాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం విచిత్రమైన గ్రహస్థితి గోచరిస్తుంది. ఏలిననాటి శని వెళ్లిపోయినా.. మంచిఫలితాలకు మరింత సమయం పడుతుంది. విసుగును తగ్గించుకుని, ఓపికను పెంచుకోవాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం సోమ, మంగళవారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. వీలైనంత ఎక్కువగా శివారాధన చేయాలి.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూల ఫలితాలుంటాయి. సహకరించే వర్గం చేరువలో ఉంటుంది. కెరియర్ పై దృష్టిసారిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయి. శత్రుబలాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ వారం బుధవారం మాత్రమే అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్నిసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సహకరించే గ్రహాల సంఖ్య నామమాత్రంగా ఉంటుంది. ఆడవిడుపుని కోరుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వేళకు నిద్రాహారాలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులవుతారు. ఎదుటివారికి సహాయం చేసేందుకు ముందుంటారు. తృప్తిపడేంత ఫలితాలకు మరింత సమయం పడుతుంది. ఈ వారం సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రబలం మినహా మిగతా గ్రహాలు పెద్దగా సహకరించట్లేదు. మాటలతో బురిడీ కొట్టించేవారు పక్కనే ఉంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో పట్టు-విడుపుగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం సోమ, మంగళ వారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం బుధవారం మాత్రమే అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
Next Story