Tue Dec 24 2024 17:40:54 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 21 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారి నుంచి సహాయసహకారాలు అందుతాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, మంగళ వారం
తిథి : ఫాల్గుణ అమావాస్య రా.10.52 వరకు
నక్షత్రం : పూర్వాభాద్ర సా.5.26 వరకు
వర్జ్యం : రా.2.16 నుండి 3.45 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.39 నుండి 9.27 వరకు, రా.11.02 నుండి 11.50 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం లోపు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవడం మంచిది. మధ్యాహ్నం నుంచి శ్రమ పెరుగుతుంది. అనవసరమైన వివాదాలు చోటుచేసుకుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. వ్యవసాయ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు అనుకూలం. మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులకు మంచి కాలం. కీలకమైన సమాచారం తెలుసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వ పరిష్కారాలతో దంపతుల మధ్య రాజీ ప్రయత్నాలు కలసివస్తాయి. ఖర్చులను నేర్పుగా సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగ, వ్యాపార పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుంచి బాగుంటుంది. సౌకర్యాలు ఏర్పడుతాయి. మీ మాట వినడానికి కూడా ఇష్టపడనివారు మీ మాటను పట్టించుకుంటారు. ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. రోజంతా ఒత్తిడిగా ఉంటుంది. అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ మాత్రమే అనుకూలం. రోజంతా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారి నుంచి సహాయసహకారాలు అందుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అందాన్ని పెంచుకునేందుకు, ఆరోగ్యానికి సంబంధించిన పనులను పూర్తిచేసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మేలు జరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుంచి బాగుంటుంది. ముఖ్యమైన పనులపై దృష్టిసారిస్తారు. మాటతీరు ఎదుటివారు నొచ్చుకునేలా లేకుండా జాగ్రత్తపడాలి. ఖర్చులు విస్తారంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఏర్పడుతాయి. మనస్సు గందరగోళంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. దృష్టిదోషం ఎక్కువగా ఉంటుంది. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఫైనాన్స్ రంగంలోవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం వరకూ బాగుంటుంది. ముఖ్యమైన పనులను 12 గంటల్లోగా పూర్తి చేసుకోవడం మంచిది. ఆ తర్వాత వృథా ఖర్చులు చోటుచేసుకుంటాయి. అనవసరమైన ప్రయాణాలుంటాయి. అనవసరంగా వాగ్వివాదాలు చోటుచేసుకుంటాయి. గడిచిన కాలమే బాగుందని ఆలోచిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాతి నుంచి బాగుంటుంది. చేపట్టిన పని పూర్తవుతుంది. పనుల్లో జాగ్రత్త వహిస్తారు. నూతన ఆలోచనలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకూ అనుకూలం. ఆ తర్వాత ఉత్సాహం తగ్గుతుంది. వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగులకు మధ్యస్థంగా ఉంటుంది. విద్యార్థులకు నామమాత్రంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాతి నుంచి అనుకూలం. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పెద్దల సలహాలు, సూచనలు పాటిస్తే ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story