Tue Dec 24 2024 02:38:40 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 24 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, ఛైత్ర మాసం, శుక్రవారం
తిథి : శు.తదియ సా.4.59 వరకు
నక్షత్రం : అశ్వని మ.1.22 వరకు
వర్జ్యం : ఉ.9.30 నుండి 11.03 వరకు, రా.10.57 నుండి 12.33 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.36 నుండి 9.25 వరకు, మ.12.38 నుండి 1.26 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉన్నా..ఉపకరిస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్వయంకృతాపరాధం మినహా పెద్దగా ఇబ్బందులు ఉండవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నిదానమే ప్రధానమన్న సూత్రాన్ని నమ్ముకుని ముందుకు సాగాలి. ఏం మాట్లాడినా పెడార్థాలు తీసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రంగా ఉంటాయి. మాటతీరులో జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. పాత పరిచయాలు బలపడతాయి. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఆకుపచ్చ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇబ్బందులతో మొదలై ప్రశాంతతో పూర్తవుతుంది. తెలివిగా వ్యవహరించి పనులను పూర్తిచేసుకుంటారు. సహోద్యోగులతో ఏర్పడే ఇబ్బందులు పరిష్కరించుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. అనవసరమైన వివాదాలతో కాస్త చికాకుకు గురవుతారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆశించిన పెట్టుబడులు, ఆశించిన మేర రొటేషన్లు ఉంటాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో చంద్రుడి సంచారం ఉండటంతో పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కీడెంచి మేలెంచాలన్న ఆలోచనలు బలపడతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అప్పులివ్వడం, తీసుకోవడానికి దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల స్థితిగతులుంటాయి. రకరకాల ఆలోచనలు ఉంటాయి. చివరిగా తీసుకునే నిర్ణయంతో సక్సెస్ అవుతారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పనులు వేగంగా జరుగుతాయి. ఇంట, బయట మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు అనుకూలం. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య తగాదాలు పరిష్కారమవుతాయి. ఎవరి మాటలు నమ్మకుండా మనసుకు నచ్చినట్టు ముందుకు సాగుతారు. వేళకు నిద్రాహారాలు అందుతాయి. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదన్న సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు చోటుచేసుకోవచ్చు. ఇంట్లో కంటే బయటే బాగుందని భావిస్తారు. వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథాఖర్చులు ఉంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. మానసిక ప్రశాంతత కొరవడుతుంది. అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు, ఉద్యోగులు, వ్యాపారస్తులకు అనుకూలం. నూతన నిర్ణయాలు, రిజిస్ట్రేషన్లను పూర్తిచేసేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఏకీభవించేవారి సంఖ్య తగ్గుతుంది. వీలైనంతవరకూ విశ్రాంతి తీసుకోవడం మంచిది. వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story