Tue Dec 24 2024 02:49:44 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 25 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఏకీభవించేవారి సంఖ్య పెరుగుతుంది. చాలాకాలం తర్వాత రోజంతా ప్రశాంతంగా..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, ఛైత్ర మాసం, శనివారం
తిథి : శు.చవితి సా.4.23 వరకు
నక్షత్రం : భరణి మ.1.17 వరకు
వర్జ్యం : రా.1.38 నుండి 3.17 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.11 నుండి 7.47 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : సా.5.30 నుండి 6.15 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు ముందుకు సాగుతాయి. రహస్య శత్రువులను తెలుసుకుంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయం ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఉంటుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక సతమతమవుతారు. క్రయవిక్రయాలను వాయిదా వేసుకోవడం మంచిది. రోజంతా సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. అప్పులు తీర్చేందుకు ఒక దారి లభిస్తుంది. ఫైనాన్స్, మార్కెటింగ్, మిషనరీ వ్యాపారాలు కొనసాగిస్తున్నవారికి సానుకూలమైన వాతావరణం ఉంటుంది. మానసిక అప్రశాంతత, భయం ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పనీ ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నడుంనొప్పి, గ్యాస్ నొప్పి వంటివి బాధిస్తారు. పక్కవారిపై పోటీ పడతారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రశాంతత లభిస్తుంది. దేనికోసం ఆరాటపడరు. అడగనిదే ఎవరికీ సలహాలివ్వరు. మీ పని మీరు చూసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యాపారస్తులకు సాధారణం. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయంలో జాగ్రత్తలు వహించాలి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, మాటసాయం చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎవరిపైనా ఆధారపడకపోవడం మంచిది. ఎవరినీ నమ్మడం, అనుమానించడం మేలు చేసే అంశాలు కావు. ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఏకీభవించేవారి సంఖ్య పెరుగుతుంది. చాలాకాలం తర్వాత రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. రకరకాల కార్యక్రమాలను చక్కదిద్దుకుంటారు. ఆత్మపరిశీలన చేసుకుంటారు. తప్పులు తెలుసుకుని సరిదిద్దుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. రహస్య శత్రువులను కనిపెడతారు. లాయర్లతో జరిపే సంప్రదింపులు అనుకూలంగా సాగుతాయి. ఎదుటివారితో మాట్లాడేటపుడు చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎవరితో మాట్లాడినా అపార్థం చేసుకుంటారు. ఇంట్లో ఉండేవారే అపార్థం చేసుకునే అవకాశాలెక్కువ. క్రీడా, మార్కెటింగ్ రంగాల్లో వారు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రశాంతంగా ఉండేందుకు ప్రాముఖ్యతనిస్తారు. వీలైనంతవరకూ రెస్ట్ తీసుకునేందుకే సమయం కేటాయిస్తారు. ప్రతి విషయాన్ని తేలికగా తీసుకోవడం అంతమంచిది కాదు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయం రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ముఖ్యంగా సంతకానికి విలువ కలిగిన ఉద్యోగులు, మాటతీరుపై ఆధారపడి ఉన్న వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. గృహం లేదా వాహన కొనుగోళ్ల ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. మాట పట్టింపులు చోటుచేసుకుంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story