Mon Dec 23 2024 02:59:47 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం, మార్చి 26 నుండి ఏప్రిల్ 1 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఒత్తిడి పెరుగుతుంది. శారీరకంగా, మానసికంగా అలసట పెరుగుతుంది. ఆర్థిక..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, ఛైత్ర మాసం, ఆదివారం
తిథి : శు.పంచమి సా.4.33 వరకు
నక్షత్రం : కృత్తిక మ.1.59 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : సా.4.38 నుండి 5.26 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.8.00 నుండి 9.00 వరకు
నవగ్రహ సంచారం
మేషం - శుక్రుడు, రాహువు
మిథునం - కుజుడు
తుల - కేతువు
కుంభం - శని
మీనం, మేషం - బుధుడు
చంద్రగ్రహ సంచారం
వృషభం, మిథునం, కర్కాటకం
మార్చి 26 నుండి ఏప్రిల్ 1 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక స్థితులు మెరుగ్గానే ఉన్నా.. కాస్త ఇబ్బంది పడతారు. రిజిస్ట్రేషన్లు, అగ్నిమెంట్లలో జాప్యం ఏర్పడుతుంది. చంద్రబలం తక్కువగా ఉండటంతో మానసిక ప్రశాంతత తగ్గుతుంది. వేళకు నిద్రాహారాలు లోపిస్తాయి. లో బీపీతో ఇబ్బంది పడతారు. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం చంద్రుడి బలం కలసివస్తుంది. ఏ పని చేయాలన్నా ప్లాన్డ్ గా, నిదానంగా సాగుతారు. వ్యాపారస్తులకు అనుకూలం. వాహనమరమ్మతులు, ఇంటి అలంకరణపై దృష్టిసారిస్తారు. ఆరోగ్య సూత్రాలను అమలుచేసే దిశగా సాగుతారు. మీ ముందొకమాట, వెనుకొక మాట మాట్లాడేవారు పెరుగుతారు. దృష్టిదోషం పెరుగుతుంది. ఈ వారం ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఒత్తిడి పెరుగుతుంది. శారీరకంగా, మానసికంగా అలసట పెరుగుతుంది. ఆర్థిక సర్దుబాట్లలో జాగ్రత్తగా ఉండాలి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. అప్పులు, తాకట్టులకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. విదేశాలకు వెళ్లేవారికి అనుకూలం. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విడాకుల విషయంలో ఒక స్పష్టత వస్తుంది. ఈ వారం మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్నిసార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సహకరించే గ్రహాల సంఖ్య తక్కువగా ఉంది. ఉన్నంతలో బాగున్నామా లేదా అని ఆలోచిస్తారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పెట్టుబడులు కోరుకునే వారికి మంచికాలం. ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని ఓర్పుగా ఉండాలి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారంలో మొదటి నాలుగురోజులు అనుకూలంగా ఉంటుంది. పిత్రార్జితాన్ని అమ్మేందుకు, విభజనకు అనుకూలం కాదు. తండ్రితో లేదా తండ్రి తరపు బంధువులతో తగాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. సంతానంవిషయంలో విపరీతంగా ఆలోచిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పాత వస్తువులను అమ్మి, కొత్తవస్తువుల కొనుగోళ్లు చేస్తారు. ఇంటి అలంకరణపై దృష్టిసారిస్తారు. తొందరపాటు తనానికి తావివ్వరు. మీ గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారని ఆలోచిస్తారు. సంఘంలో గౌరవ, మర్యాదలను కలిగి ఉంటారు. ఈ వారం మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకాలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఎంతో ఆలోచించి ప్లాన్ చేసుకున్న పనుల్లో ఆఖరి నిమిషంలో ఏదొక డిస్టర్బెన్స్ రావడంతో నిరాశ చెందుతారు. అనుకున్న ఫలితాలు అందక ఇబ్బంది పడతారు. సేవింగ్స్ చేయడం అసాధ్యం. పాత అనారోగ్యం తిరగబెడతారు. పుస్తక పఠనంపై ఆసక్తి చూపుతారు. పాత పరిచయాలు ఉపయోగపడతాయి. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. గురు, శుక్రుడి బలంతో సహకరించే వర్గం చేరువలో ఉంటుంది. ఫైనాన్స్, వడ్డీ వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. నడుంనొప్పి, కాళ్లనొప్పులతో ఇబ్బందిపడతారు. పాత పరిచయాలు మళ్లీ కొనసాగిస్తారు. ఇంట్లోని వారితో మాట పట్టింపులు ఏర్పడుతాయి. ఈ వారం ఆది, సోమ వారాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం చంద్రబలం సహకరిస్తుంది. లాయర్లతో సంప్రదింపులు, కోర్టుకేసులపై దృష్టిసారిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి. అన్నదమ్ముల మధ్య తగాదాలు చోటుచేసుకుంటాయి. పెద్దల అండదండలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన స్నేహాలు, పరిచయాలు వృద్ధిచెందుతాయి. ఈ వారం ఆది, సోమ, మంగళ, బుధ వారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం చాలా కాలం తర్వాత అనుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనారోగ్యం నుంచి ఊరట లభిస్తుంది. పిల్లల్లో మొండితనం, మంకుపట్టు తగ్గే సూచనలున్నాయి. అన్నివృత్తులు, అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. నిదానమే ప్రధానంగా ముందుకుసాగాలి. వ్యాపారస్తులకు రొటేషన్లు టైట్ గా ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులున్నా వెంటనే బయటపడతారు. అలర్జీ, స్కిన్ కు సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఈ వారం శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారంసహకరించే గ్రహాల సంఖ్య నామమాత్రంగా ఉంది. ఆర్థిక, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరేమన్నా సర్దుకుపోవాలి. వాహనమరమ్మతులో ఏమరపాటుతనం పనికిరాదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అప్పులు, మధ్యవర్తిత్వం, షూరిటీ సంతకాలకు దూరంగా ఉండాలి. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుబ్రమణ్య అష్టకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేయడం మంచిది.
Next Story