Tue Dec 24 2024 02:50:13 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 28 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు అంతంతమాత్రంగా ఉంటాయి.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, ఛైత్ర మాసం, మంగళవారం
తిథి : శు.సప్తమి రా.7.02 వరకు
నక్షత్రం : మృగశిర సా.5.30 వరకు
వర్జ్యం : రా.2.49 నుండి 4.35 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.34 నుండి 9.22 వరకు, రా.11.01 నుండి 11.48 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి.ఆలోచనలు కీడెంచి మేలెంచాలన్న విధంగా కొనసాగుతాయి. వ్యాపారస్తులకు అనుకూలం. బ్యాంక్ రుణాల కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలు, వివాదాలతో రోజంతా కొనసాగుతుంది. సహకరించే వర్గం చేరువలో ఉంటుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. దేవుడి అనుగ్రహం ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయాన్ని అనుమాన దృష్టితో చూస్తారు. చేసే పనిలో వచ్చే లాభం ఏంటని ఆలోచిస్తారు. లాయర్లు, టీచర్లకు అనుకూలఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు అంతంతమాత్రంగా ఉంటాయి. ప్రయాణాలు కలసిరావు. నష్టాలుండవు కానీ సమయం వృథా అవుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శత్రుబలం తగ్గుతుంది. అధికారులతో సంప్రదింపులు కలసివస్తాయి. ఈరోజు పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. లాభనష్టాలుండవు. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారాల్లోనే ఇదే పరిస్థితి ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నిదానంగా ఆలోచిస్తారు. ప్రశాంతత లభిస్తుంది. ఎవరినీ నమ్మలేరు. దృష్టిదోషం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పనిలోనూ ముందుకి వెళ్లలేరు. పనుల్లో గందరగోళం నెలకొంటుంది. వృథా ఖర్చులు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎదుటివారిని ఆకర్షిస్తారు.మనసులో మాటను ఎదుటివారితో పంచుకునేందుకు, ఇంటర్వ్యూలకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. క్రయ, విక్రయాలు సానుకూలంగా సాగుతాయి. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. నిర్ణయాలు చురుకుగా తీసుకుంటారు. ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయం రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంట్లో చిన్నపాటి తగాదాలు జరుగుతాయి. ఇంట్లో కంటే బయటి పనులపై దృష్టిసారిస్తారు. పనులు నత్తనడకన సాగుతాయి. ఎదుటివారిని అంచనా వేయడంలో విఫలమవుతారు. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు బద్ధకం పెరుగుతుంది. ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. పనులు వాయిదా పడుతుంటాయి. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
Next Story