Tue Dec 24 2024 02:35:58 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 29 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మనసుకు నచ్చిన విధంగా గడుపుతారు. ఎవరితోనైనా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, ఛైత్ర మాసం, బుధవారం
తిథి : శు.అష్టమి రా.9.07 వరకు
నక్షత్రం : ఆరుద్ర రా.8.05 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉ.11.47నుండి 12.36 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.30 నుండి 10.15 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. పెండింగ్ లో పనులు పూర్తవుతాయి. ఆగిపోయిన ఫైల్స్ లో కదలికలుంటాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు విస్తారంగా ఉంటాయి. అయినవారితోనే మాట పట్టింపులు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎంత నిదానంగా ఉంటే అంత మంచిది. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు కీడెంచి మేలెంచాలన్న చందంగా వ్యవహరిస్తారు. ఆరోగ్య సూత్రాలను పాటించడం లేదా పాటించే నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతికూల ఫలితాలుంటాయి. ప్రయాణాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. విద్యార్థులు శ్రమపడాలి. పనులు ముందుకి సాగవు. ఒడిదుడుకులతో ఇబ్బంది పడతారు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కోర్టు కేసులపై దృష్టిసారిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. పాతపరిచయాలు ఉపకరిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకున్నదొకటి.. జరిగేది మరొకటిగా ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మనసుకు నచ్చిన విధంగా గడుపుతారు. ఎవరితోనైనా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. ఇష్టంలేని వారికి దూరంగా ఉంటారు. ఢీ అంటే ఢీ అన్న చందంగా వ్యవహరిస్తారు. మీ ప్రయోజనాలను ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అయినంతవరకూ ప్రశాంతంగా ఉండాలి. తప్పనిసరి పనులపై దృష్టిసారించడం మంచిది. ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వారినీ అనుమానంతో చూడటం మంచిదికాదు. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలపై దృష్టిసారిస్తారు. భవిష్యత్ పై నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంపై దృష్టిపెడతారు. దంపతుల మధ్య తెలియని వెలితి ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. లాయర్లు, టీచర్లు, ఫైనాన్స్ రంగంలోవారికి మంచి ఫలితాలుంటాయి. చిరువ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. విద్యార్థులకు సాధారణ ఫలితాలుంటాయి. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగాలతో ఆడుకునేవారు పెరుగుతారు. బంధువులతో వైరం పెరుగుతుంది. ఎదుటివారి నుంచి కావలసిన సమాచారం రాబట్టుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. మంచికిపోతే చెడు ఎదురవుతుంది. బద్ధకం పెరుగుతుంది. పనులు వాయిదా పడుతుంటాయి. వీలైనంతవరకూ వాహనాన్ని నడపకపోవడం మంచిది.ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story