Wed Dec 25 2024 06:08:56 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 2 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రశాంతత లభిస్తుంది. నిదానంగా ఆలోచిస్తారు. వేళకు నిద్రాహారాలు అందుతాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, గురువారం
తిథి : శు.దశమి ఉ.6.39 వరకు
నక్షత్రం : ఆరుద్ర మ.12.43 వరకు
వర్జ్యం : రా.2.13 నుండి 4.01 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.23 నుండి 11.09 వరకు, మ.3.04 నుంచి 3.50 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : ఉ.8.50 నుండి 9.15 వరకు, సా.4.00 నుండి 5.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. రిజిస్ట్రేషన్లు సజావుగా నిర్వహించుకోగలుగుతారు. నూతన సమాచారాన్ని తెలుసుకుంటారు. విద్యార్థినీ, విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఎంతతక్కువ మాట్లాడితే అంతమంచిది. అపార్థాలు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు పనివేళలు పెరుగుతాయి. ఇంటి పని, ఆఫీస్ పని భారంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉత్సాహంతో ఉంటారు. కొత్త ఆలోచనలు చేస్తారు. కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బ్లూ కలర్.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. సహాయపడేవారు అందుబాటులో లేక అసౌకర్యానికి లోనవుతారు. రొటేషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి చికాకు పెడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రశాంతత లభిస్తుంది. నిదానంగా ఆలోచిస్తారు. వేళకు నిద్రాహారాలు అందుతాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేవారికి మంచి కాలం. ఎదుటివారికి సలహాలిస్తారు. అపవాదులు, అపనిందలకు దూరంగా, మనసుకి నచ్చినవారితో దగ్గరగా ఆనందంగా గడుపుతారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త పరిచయాల ప్రయత్నాలు కలసివస్తాయి. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. నూతన వస్త్రాభరణాల కొనుగోళ్లు చేస్తారు. కెరియర్ పై దృష్టిసారిస్తారు. శుభ్రతకు అధిక ప్రాముఖ్యతనిస్తారు. రహస్య అంశాలపై ఆసక్తి చూపుతారు. వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థికంగా లాభనష్టాలుండవు. మీ ముందు ఒకలా, మీ వెనుక ఒకలా మాట్లాడే వారెవరో తెలుసుకుంటారు. పనులు వాయిదా పడతాయి. నిరుత్సాహాన్ని దరిచేరనీయరు. కోపం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు. సౌకర్యాలను అనుభవించే అవకాశాలు తక్కువ. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. శ్రమ పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. పెళ్లి చూపులు, ప్రేమలు ఫలిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. శుభవార్తలు వింటారు. మనసు ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. తగాదా పడితే తప్ప పూర్తికాని పనులపై దృష్టిసారిస్తే.. పనులు పూర్తవుతాయి. మిత్రులెవరో, శత్రువులెవరో తెలియక సతమతమవుతారు. వీలైనంత వరకూ ఎవరినీ నమ్మకపోవడం మంచిది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉండవు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పనీ తగాదాతో కూడుకుని ఉంటుంది. ప్రతిపనిలోనూ ఏదోక వివాదం ఉంటుంది. ఎదుటివారి నుంచి ఆశించిన మేర సహాయం అందక నిరుత్సాహ పడతారు. ఆర్థిక ఒత్తిడులను అధిగమిస్తారు. ఉద్యోగపరంగా పనివేళలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువ. అనవసరమైన ఖర్చులు ఎదురవుతాయి. ప్రతి విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ప్రశాంతత కొరవడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
Next Story