Tue Dec 24 2024 03:04:03 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 30 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గడిచిన రెండ్రోజులకంటే.. ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, గురువారం
తిథి : శు.నవమి రా.11.30 వరకు
నక్షత్రం : పునర్వసు రా.10.58 వరకు
వర్జ్యం : ఉ.9.32 నుండి 11.19 వరకు
దుర్ముహూర్తం : ఉ. 10.10 నుండి 10.59 వరకు, మ.3.01 నుండి 3.50 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : మ.12.30 నుండి 1.20 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ పెరుగుతుంది. రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయి. ఆర్థిక విషయాలను జాగ్రత్తగా గమనించాలి. ఉద్యోగ, వ్యాపారాల పరంగా సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా, శుభకార్యాల పరంగా తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కెరియర్ మీద ఆసక్తి పెరుగుతుంది. వ్యక్తిగత ఆలోచనలు బలపడుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గడిచిన రెండ్రోజులకంటే.. ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన మనస్పర్థలు పరిష్కారమవుతాయి. ఖర్చులున్నా ఉపకరిస్తాయి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు పెద్దగా ఇబ్బందులుండవు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శత్రుబలం పెరుగుతుంది. అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియకుండా చేసిన చిన్న తప్పులే పెద్ద సమస్యలుగా పరిణమిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వివాహాది శుభకార్యాల విషయాలు కలసివస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. పాతపరిచయాలు బలపడతాయి. కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తెలియని ఉత్సాహం కలుగుతుంది. ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఓ కంట కన్నీరు ఓ కంట పన్నీరు అన్న పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అగ్నిమెంట్లు, రిజిస్ట్రేషన్లు సజావుగా పూర్తవుతాయి. రాజకీయ, కళా, సాహిత్య, మిషనరీ వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. బద్ధకం పెరుగుతుంది. స్వయంగా పనులు వాయిదా వేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయ విక్రయాల అంశాలు అనుకూలంగా ఉంటాయి. విజయాలు వరిస్తాయి. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు పూర్తవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. మాట పట్టింపులు చోటుచేసుకుంటాయి. తొందరపాటు తగదు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఇబ్బందులుండవు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. అధికారుల నుంచి ఒత్తిడులు తగ్గుతాయి. రోజంతా సాదాసీదాగా గడిచిపోతుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story