Tue Dec 24 2024 02:36:34 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 31 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్రవారం
తిథి : శు.దశమి రా.1.59 వరకు
నక్షత్రం : పుష్యమి రా.1.55 వరకు
వర్జ్యం : ఉ.7.57 నుండి 9.45 వరకు
దుర్ముహూర్తం : ఉ. 8.32 నుండి 9.21 వరకు, మ.12.35 నుండి 1.24 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.1.40 నుండి 2.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఊహాగానాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ మీద పనులు సానుకూలమవుతాయి. విద్యర్థులకు అనుకూలం. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. భవిష్యత్ పై ప్రణాళికలు వేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మాటపట్టింపులు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గడిచిన రెండ్రోజులకంటే బాగుంటుంది. ప్రతి నిర్ణయాన్ని సొంతంగా తీసుకుంటారు. అన్ని విధాలా కలిసివస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుత్రోవ పట్టించేవారు సమీపంలోనే ఉంటారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, వ్యాపారంలో పెద్దగా ఇబ్బందులుండవు. అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. పనిచేసే చోట తలదించుకునేందుకు ఇష్టపడరు. శత్రువులకు ఎదురెళ్లేవిషయంలో జాగ్రత్తగా ఉండాలి. దృష్టిదోషం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వేళకు నిద్రాహారాలు పొందుతారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. శ్రేయోభిలాషులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అపార్థాలు తొలగించుకునేందుకు అనుకూలమైన కాలం. అనారోగ్యానికి మంచి వైద్యం అందుతుంది. ధర్మబద్ధమైన మార్గంలో ఉన్నారా లేదా అని ఆలోచించడం శ్రేయస్కరం. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. రిస్క్ కు ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు, ప్రేమలను తెలిపేందుకు, దంపతుల మధ్య అన్యోన్యతను పెంచుకునే ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. మొండిబాకీలపై దృష్టి సారిస్తే ఫలితం ఉంటుంది. దీర్ఘకాలిక చర్మవ్యాధులకు మెరుగైన ఫలితాలు అందుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పనుల్లో కదలికలు ఏర్పడుతాయి. ప్రతివిషయంలో మెరుగుదల ఉంటుంది కానీ.. పూర్తిగా బాగుందనే అవకాశాలు లేవు. రుణ ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story