Wed Dec 25 2024 06:56:33 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 3 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. లాభనష్టాలు లేని స్థితి ఉంటుంది. నువ్వు తప్ప ఎవరూ ఈ పని
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్రవారం
తిథి : శు.ఏకాదశి ఉ.9.11 వరకు
నక్షత్రం : పునర్వసు మ.3.43 వరకు
వర్జ్యం : రా.12.43 నుండి 2.31 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.48 నుండి 9.35 వరకు, మ.12.43 నుంచి 1.30 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.1.45 నుండి 2.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఉత్సాహం తగ్గుతుంది. లేనిపోని మాటలు వినడం వల్ల ఇబ్బందులు పడతారు. సెంటిమెంట్ వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మంచి ఆహారం లభిస్తుంది. క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతాయి. రిజిస్ట్రేషన్లు ముందుకి సాగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్దగా ఒడిదుడుకులు ఉండవు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. మంచి చెప్పినా చెడు ఎదురవుతుంది. ఎదిటివారికి మీ సలహాలు ఉపకరిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గ్రీన్ కలర్.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్తగా ఆలోచిస్తారు. తెలియని విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. తగాదా పడితే తప్ప పనులు పూర్తికావనుకుంటే నిర్మొహమాటంగా వ్యవహరిస్తారు. ఉద్యోగ, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. వ్యతిరేక ఫలితాలుంటాయి. నిరుత్సాహానికి దూరంగా ఉండాలి. పట్టు, విడుపుగా వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఎదుటివారిని మెప్పించే ప్రయత్నాలు కలసివస్తాయి. సేవింగ్స్ అక్కరకు వస్తాయి. పెళ్లిళ్లు, విడాకులకు సంబంధించిన అంశాలు అనుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కెరియర్ అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు సహకరిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వారంరోజుల కంటే.. ఈరోజు ఊరట కలిగే ఫలితాలుంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. లాభనష్టాలు లేని స్థితి ఉంటుంది. నువ్వు తప్ప ఎవరూ ఈ పని చేయలేరు అన్న విషయం సంతోషం కలిగిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో చంద్రుడు ఉండటంతో అన్నీ వ్యతిరేక ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కీడెంచి మేలెంచాలన్న చందంగా ఆలోచిస్తారు. ఆరోగ్యం కాస్త నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి బయటపడే ప్రయత్నాలు కలసివస్తాయి. కొన్ని సంఘటనలు ఆన్నందాన్నిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ బిల్లులు వసూలవుతాయి. మూలకు పడిపోయిన పనుల్లో కదలికలు వస్తాయి. శుభవార్తలు వింటారు. రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. అనుకున్నంత వేగంగా పనులు జరగవు. అప్పులివ్వడం, తీసుకోడానికి దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story