Wed Dec 25 2024 06:11:36 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : మార్చి 5 నుండి మార్చి 11 వరకు వారఫలాలు, పరిహారాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం కాస్త ఊరటగా ఉంటుంది. కష్టాలొచ్చినా తట్టుకుని నిలబడతారు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, ఆదివారం
తిథి : శు.త్రయోదశి మ.2.07 వరకు
నక్షత్రం : ఆశ్లేష రా.9.30 వరకు
వర్జ్యం : ఉ.9.00 నుండి 10.47 వరకు
దుర్ముహూర్తం : సా.4.38 నుండి 5.25 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : మ.1.40 నుండి 2.30 వరకు
నవగ్రహ సంచారం
మేషం -రాహువు
వృషభం - కుజుడు
తుల - కేతువు
కుంభం - రవి, బుధుడు, శని
మీనం -గురువు, శుక్రుడు
చంద్రగ్రహ సంచారం
కర్కాటకం, సింహం, కన్య, తుల
మార్చి 5 నుండి మార్చి 11 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అధికారులతో ఉన్న తగాదాలు పరిష్కారమవుతాయి. వివాహాది శుభకార్యాలు ముందుకు సాగుతాయి. ఖర్చులు విస్తారంగా ఉన్న ఉపకరిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. పెద్దగా ఇబ్బందులుండవు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. మీ ముందొక మాట, మీ వెనుక మరోమాట మాట్లాడేవారితే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగమార్పు మంచిది కాదు. ద్వితీయ వివాహ ప్రయత్నాలకు అనుకూలం. ఈ వారం ఆది, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పఠించడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం నిదానమే ప్రధానంగా వ్యవహరించడం మంచిది. సహకరించేవారి సంఖ్య నామమాత్రంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం మధ్యస్థంగా ఉంటుంది. మీ సలహాలు, సూచనలు ఎదుటివారికి ఉపకరిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. తొందరపాటు తగదు. ఈ వారం సోమ, మంగళ వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని, శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేసి, వీలైనన్ని ఎక్కవసార్లు శివారాధన చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు విస్తారంగా ఉంటాయి. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. భార్య, భర్తల మధ్య ఐక్యత లోపించే అవకాశాలు ఎక్కువ. సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడతారు. ఈ వారం ఆది, గురువారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పారాయణ చేయాలి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చైపోతుంది. ఏ పనిచేయాలన్నా ఒకటిరెండుసార్లు ఆలోచించడం మంచిది. పనులకు సమయం కేటాయించినా వర్కవుట్ అవ్వవు. రెస్ట్ తీసుకునే సమయం ఉండదు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఒత్తిడులుంటాయి. ఈ వారం సోమ, మంగళ వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య స్తోత్రాన్ని, సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, షూరిటీ సంతకాలు, మధ్యవర్తిత్వాలకు ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. కొండల్లా వచ్చిన కష్టాలు మబ్బుల్లా వెళిపోతాయి. సొంత నిర్ణయాలవల్ల పెద్దగా ఇబ్బందులుండవు. అన్నింటిలోనూ మెరుగైన ఫలితాలుంటాయి. తెలియని విషయాన్ని ఒప్పుకునేందుకు మొహమాట పడతారు. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఈ వారం ఆది, గురువారాలు అనుకాలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేసి, దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. సహకరించే గ్రహాల సంఖ్య నామమాత్రంగా ఉంటుంది. అదృష్టం మీద భారం వేసి.. చేయాలనుకున్న పనులను సకాలంలో పూర్తచేస్తారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభించక నిరుత్సాహ పడతారు. ఎక్కువగా ఎమోషనల్ అవుతారు. అపార్థాలు పెరుగుతాయి. శత్రుబలం పెరుగుతుంది. వీలైనంత తక్కువగా మాట్లాడటం మంచిది. ఈ వారం ఆది, సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్ని ఎక్కువసార్లు దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం పెద్దగా ఒడిదుడుకులు ఉండవు. విహారయాత్రలు, వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇంట్లో ఉన్నవారితో ఎప్పుడూ ఏదొక తగాదా రావడంతో విసుగు చెందుతారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. శత్రుబలం పెరుగుతుంది. ఇష్టమైన భోజనాన్ని స్వీకరించగలుగుతారు. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురు వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్నిసార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఉపకరిస్తాయి.ఇంట, బయట ఒత్తిడి తగ్గుతుంది. ప్రయోజనాలున్నా.. చేతికి అందిరాదు. ఏం జరిగితే అది జరుగుతుంది, నా ఇష్టప్రకారం ఉంటానన్న ఆలోచనలు బలపడతాయి. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. మీ తప్పులేకపోయినా మాట పడాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. చిన్న చిన్న అనారోగ్యాలు కూడా పెద్ద చికాకులు తెప్పిస్తాయి. మీ మానసిక స్థితి ముళ్లకంచె వేసిన పంటలా ఉంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక చింతనను పెంచుకుంటారు. ఈ వారం ఆదివారం మాత్రమే అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేసి, రాత్రివేళ కుక్కకు ఏదైనా ఆహారాన్ని పెట్టడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం కాస్త ఊరటగా ఉంటుంది. కష్టాలొచ్చినా తట్టుకుని నిలబడతారు. వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. బద్ధకం పెరుగుతుంది. ఉత్సాహం లోపిస్తుంది. ఈ వారం ఆది, సోమ, మంగళ వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం కుజ, చంద్రుల బలం అనుకూలంగా ఉంటుంది కాబట్టి.. పెద్దగా ఇబ్బందులుండవు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ఖర్చులు, సమస్యలున్నా అధిగమిస్తారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు కేసుల్లో మీదే పైచేయి అవుతుంది. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురు వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శివకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది.
Next Story