Wed Dec 25 2024 06:16:30 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 6 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. వేళకు నిద్రాహారాలను కలిగి ఉంటారు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, సోమవారం
తిథి : శు.చతుర్దశి సా.4.17 వరకు
నక్షత్రం : మఖ రా.12.05 వరకు
వర్జ్యం : ఉ.10.48 నుండి 12.34 వరకు
దుర్ముహూర్తం : మ.12.42 నుండి 1.29 వరకు, మ.3.04 నుంచి 3.51 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : సా.5.45 నుండి 6.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఎదుటివారితో మాటామంతీ సాగిస్తారు. విలువైన సమాచారం పొందుతారు. కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి మంచి కాలం. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వాయిదా పడుతుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. నమ్మకద్రోహం జరగవచ్చు. క్రయవిక్రయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ప్రయాణాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఫ్యాచర్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు బ్లాక్ కలర్.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ప్రతికూల వాతావరణంలో అనుకూల ఫలితాలకై తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. వయసులో పెద్దవారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల పరిస్థితులుంటాయి. మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. దంపతుల మధ్య మనస్పర్థలు తొలగుతాయి. స్థిరాస్తులపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు లేత నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. పాతవిషయాలు పదే పదే గుర్తుకొస్తాయి.పరిచయాలు ఉపకరించకపోవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. వేళకు నిద్రాహారాలను కలిగి ఉంటారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వసూలు చేసుకునేందుకు అనుకూలం.ఫలితాలు తక్కువగా ఉన్నా మీ వంతు ప్రయత్నం కొనసాగిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. కెరీర్ పై దృష్టిసారిస్తారు. ఉద్యోగ ఉన్నతికోసం ప్రయత్నిస్తారు. సంతానం విషయం ఆనందాన్నిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలుంటాయి. ఒత్తిడులున్నా వాటిని అధిగమిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదీ పెద్దగా కలసిరాదు. తప్పు మీదైనా, ఎదుటివారిదైనా నష్టం మీదే అవుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు ముందడుగులో ఉంటాయి. డాక్యుమెంటేషన్ అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఆకుపచ్చ రంగు.
Next Story