Wed Dec 25 2024 06:40:20 GMT+0000 (Coordinated Universal Time)
MARCH 9 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సమస్యలపై దృష్టిసారిస్తే.. పరిష్కారం
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, గురువారం
తిథి : బ.విదియ రా.8.54 వరకు
నక్షత్రం : హస్త తె.5.57 వరకు
వర్జ్యం : మ.1.18 నుండి 3.00 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.20 నుండి 11.07 వరకు, మ.3.04 నుండి 3.51 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : సా.5.40 నుండి 6.20 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. రుణ ప్రయత్నాలు, ఆర్థిక అంశాలకు అనుకూలమైన కాలం. తగాదా పడితే తప్ప పూర్తికాని పనులపై దృష్టిసారించాలి. వృత్తి, ఉద్యోగాల పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఇబ్బంది పెట్టేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. తగాదాలు విభేదాలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటుంది. క్రయ విక్రయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడతాయి. ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో వైఫల్యం చెందుతారు.ఏదొక రకంగా పనుల్లో స్తబ్దత ఉంటుంది. ఆలోచనలు పెరుగుతాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు కలసివస్తాయి. పరిచయాలు అభివృద్ధి చెందుతాయి. ఎవరితో ఎలా మాట్లాడితే పనులు అవుతాయో ఆ నేర్పును తెలుసుకుంటారు. ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. మీ ప్రమేయం లేకుండానే ఒక వర్గానికి చెందినవారు మీపై ఫిర్యాదు చేయవచ్చు. మీకు సంబంధం లేని విషయాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విస్తరణకు అనుకూలం కాదు. అన్ని సౌకర్యాలున్నా అనుభవించలేరు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఉత్సాహంగా ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. ప్రయాణాలు కలసివస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువైనా ఉపకరిస్తాయి. అలంకరణపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఏ పని చేయాలన్నా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాక ముందుకెళ్లడం మంచిది. నిదానమే ప్రధానమన్న సూత్రాన్ని నమ్ముకోవాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ప్రయాణాలపై దృష్టిసారించడం మంచిది కాదు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సమస్యలపై దృష్టిసారిస్తే.. పరిష్కారం లభిస్తుంది. ఆర్థికంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు, ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఒళ్లునొప్పులు బాధిస్తాయి. రకరకాల ఆలోచనలతో తొందరపాటు తనం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రకరకాల సౌకర్యాలు సమకూరుతాయి. బయటకు వెళ్లాలనే ఆలోచనలు బలపడుతాయి. విదేశీయాన ప్రయత్నాలు కలసివస్తాయి. పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థికంగా ఊరట లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ప్రశాంతత ఏర్పడుతుంది. మధ్యవర్తిత్వ పరిష్కారమార్గాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. అర్థం చేసుకునేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారి సహాయసహకారాలు కలసివస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఆరోగ్య పరంగా పెద్దగా ఇబ్బందులుండవు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
Next Story