Mon Dec 23 2024 12:59:09 GMT+0000 (Coordinated Universal Time)
MAY 10 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మాట నిలబెట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బుధవారం
తిథి : బ.పంచమి మ.1.49 వరకు
నక్షత్రం : పూర్వాషాఢ సా.4.11 వరకు
వర్జ్యం : రా.11.39 నుండి 1.09 వరకు
దుర్ముహూర్తం : ఉ.11.46 నుండి 12.38 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.9.15 నుండి 9.50 వరకు, సా.4.00 నుండి 4.45 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎక్కువగా ఆలోచిస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసేందుకు చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. రోజంతా అంచనాల మేరకు కొనసాగుతుంది. ఖర్చులు విస్తారంగా ఉంటాయి. అప్పులు ఇవ్వకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కీడెంచి మేలెంచాలన్న విధంగా ఆలోచిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ప్రతి విషయాన్ని వాయిదా వేయడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్తదనాన్ని కోరుకుంటారు. కొత్తవిషయాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. అనేక రకాల కొనుగోళ్లపై దృష్టిసారిస్తారు. వస్తువులను మార్చుతారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎదుటివారిని అంచనా వేస్తారు. రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తారు. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. ఆహారం, నిద్ర, వసతులు, సౌకర్యాలను సమకూర్చుకుంటారు. పాడేన వస్తువులను రీప్లేస్ చేయాలన్న ఆలోచనలు బలపడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృథా ఖర్చులు ఎక్కువగా పెడతారు. తగాదా పడితే తప్ప ఏ పనీ పూర్తికాదు.బంధువులకు దూరంగా ఉంటారు. ఒంటరితనాన్ని ఇష్టపడతారు. తప్పదన్నట్టుగానే పనులు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మనిషొక చోట మనసొక చోట అన్నట్టుగా ఉంటారు. పనులు వాయిదా పడుతుంటాయి. వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మాట నిలబెట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ఆరోగ్య సూత్రాలను పాటించేందుకు శ్రీకారం చుడతారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అలసిపోతారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ నుంచి ఎదుటివారు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారస్తులు, న్యాయవాదులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల వాతావరణం ఉంటుంది. హీరోయిజాన్ని ప్రదర్శిస్తారు. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొత్తవిషయాలకు మరింత దూరంగా ఉండాలి. తప్పు జరగదు అనుకున్న పనులపై మాత్రమే దృష్టి సారించాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. చిన్నపొరపాటు దొర్లినా దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే అనుకూల ఫలితాలు పొందుతారు. క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అప్పులు ఇవ్వడం, తీసుకోవడానికి దూరంగా ఉండాలి. సలహాలిచ్చే వారివల్ల విసుగు, చిరాకు ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం. వాహన మరమ్మతుల విషయంలో ఏమరపాటుతనం పనికిరాదు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
Next Story