Mon Dec 23 2024 12:48:53 GMT+0000 (Coordinated Universal Time)
MAY 13 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. కీడెంచి మేలెంచాలన్న విధంగా ఆలోచిస్తారు.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శనివారం
తిథి : బ.అష్టమి ఉ.6.50 వరకు, తదుపరి బ.నవమి తె.4.43 వరకు
నక్షత్రం : ధనిష్ఠ ఉ.11.35 వరకు
వర్జ్యం : సా.6.23 నుండి 7.54 వరకు
దుర్ముహూర్తం : ఉ.5.48 నుండి 7.30 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.11.00 నుండి 11.40 వరకు, సా.5.00 నుండి 6.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. మానసిక ఆందోళన ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒత్తిడికి లోనవుతారు. బెటర్ జాబ్స్, బెటర్ కెరియర్ పై దృష్టిసారిస్తారు. కళా, సాహిత్య రంగాలవారికి అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాస్త ఊరటగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఊపిరి పీల్చుకునే విధంగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు చెప్పుకోదగ్గ ఇబ్బందులేవీ ఉండవు. ఆరోగ్యం కాస్త నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారు మాట్లాడే మాటల్లో మంచిచెడులను బేరీజు వేసుకుని మసులుకుంటారు. ప్రతివిషయంలో బ్యాలెన్స్ డ్ గా వ్యవహరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయం రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరేమనుకున్నా మీకు నచ్చినట్టే ఉంటారు. ముక్కుసూటితనంగా వ్యవహరిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. కీడెంచి మేలెంచాలన్న విధంగా ఆలోచిస్తారు. ఫిర్యాదులు, న్యాయపరమైన అంశాలకు అనుకూలంగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. బాధ్యతలపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన తగాదాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. గడిచిపోయిన సంఘటనలు పదేపదే జ్ఞాపకానికి వస్తాయి. రకరకాల ఆలోచనలు చేస్తారు. రోజంతా ఊహలతో గడిచిపోతుంది. ఆర్థిక విషయాల్లో ఏమరపాటుతనం పనికిరాదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వీలైనంత వరకూ ఇంటిపట్టునే ఉండటం మంచిది. వీలైనంత తక్కువ మాట్లాడటం ఉత్తమం. ప్రయాణాలు తప్పనిసరి అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. పనులు వాయిదా పడతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కోపం పెరుగుతుంది. ఎవరి అంచనాలకు అందరు. కాంట్రాక్ట్ రంగంలోవారికి మెరుగైన ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. మంచిని తీసుకుంటూ అనవసరమైన విషయాలను పక్కన పెట్టాలి. మానసిక అనారోగ్యం, నడుమునొప్పి, కాళ్లనొప్పులున్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకునేదొకటి జరిగేది మరొకటిగా ఉంటుంది. ఎందులోనూ ఇంట్రెస్ట్ చూపించరు. ఖర్చులు పెరుగుతాయి. వృథా ప్రయాస ఎక్కువగా ఉంటుంది. అర్థం చేసుకునేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. భగవంతుడిపై భారం వేసి ముందుకు సాగిపోతారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ప్రతి విషయంలో అంతో ఇంతో నష్టపోతారు. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story