Mon Dec 23 2024 07:54:16 GMT+0000 (Coordinated Universal Time)
MAY 17 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అన్నివిధాలా జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులుంటాయి.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, గురు బుధవారం
తిథి : బ.త్రయోదశి రా.10.30 వరకు
నక్షత్రం : రేవతి ఉ.7.39 వరకు
వర్జ్యం : రా.3.25 నుండి 5.00 వరకు
దుర్ముహూర్తం : ఉ.11.46 నుండి 12.38 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.10 నుండి 9.40 వరకు, సా.4.00 నుండి 4.45 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. వాహన మరమ్మతుల్లో ఏమరపాటు పనికిరాదు. నిదానంగా పనులు పూర్తిచేసుకోవాలి. శుభవార్తలు వింటారు. కొత్త విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. వేళకు తగిన ఆహారం అందక నీరసించిపోతారు. ఎదుటివారిని అంచనా వేయడంలో వైఫల్యం చెందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లకు, తగాదాల పరిష్కారానికి, నూతన ఉద్యోగ అవకాశాలకు, పరిచయాలను పెంచుకునేందుకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసిక ప్రశాంతత తగ్గుతుంది. పనుల్లో వేగం పెరుగుతుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఎదుటివారితో మాట్లాడేటపుడు వ్యూహాత్మకంగా ఉండాలి. తక్కువగా మాట్లాడాలి.అప్పులు ఇవ్వడం, తీసుకోడానికి దూరంగా ఉండాలి. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు అవసరం. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అన్నివిధాలా జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులుంటాయి. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఆరోగ్యం ఊరటనిస్తుంది. మరిచిపోయారనుకున్న విషయాలపై దృష్టిసారిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు సానుకూలంగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడులను అధిగమిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. తగాదాలు, వివాదాలకు దూరంగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు అసౌకర్యంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మీకెవరూ సహాయపడట్లేదన్న ఆలోచనలు బలపడుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాలకు అనుకూల సమయం కాదు. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ ఇబ్బంది కలిగినా అది స్వయంకృతాపరాధమే. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారిని అంచనా వేయడంలో వైఫల్యం చెందుతారు. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. మానసికంగా, శారీరకంగా అలసిపోతారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
Next Story