Mon Dec 23 2024 07:49:46 GMT+0000 (Coordinated Universal Time)
MAY 18 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కోపం కంట్రోల్ చేసుకుంటే అన్నింటా విజయం పొందుతారు. ఆర్థిక విషయాల్లో..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, గురువారం
తిథి : బ.చతుర్దశి రా.9.45 వరకు
నక్షత్రం : అశ్వని ఉ.7.22 వరకు
వర్జ్యం : సా.5.00 నుండి 6.38 వరకు
దుర్ముహూర్తం : ఉ.10.03 నుండి 10.55 వరకు, మ.3.12 నుండి 4.04 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : మ.12.50 నుండి 1.15 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొనుగోళ్లు, అమ్మకాలపై దృష్టిసారిస్తారు. ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుంటారు. రహస్యాలను పంచుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆహార నియమాలను జాగ్రత్తగా పాటించుకోవాలి. శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శరీరం అలసిపోతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా యోగదాయకంగా ఉంటుంది. అప్పులు ఇవ్వడం, తీసుకోవడంపై దృష్టిసారిస్తారు. ప్రతి చిన్నవిషయంలో మీదే పైచేయి కావాలనుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఉంటుంది. రహస్య శత్రువులను కనుగొంటారు. రోజంతా చెప్పుకోదగిన ఒడిదుడుకులుండవు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. కోర్టు సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సంఘంలో గౌరవం కలిగి ఉంటారు. ఎదుటివారి నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఆర్థిక విషయాలు ఊరటనిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్త అవసరం. కీలకమైన విషయాలను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మెరుగైన ఫలితాలు పొందుతారు. అధికారుల మెప్పు పొందుతారు. రోజంతా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కోపం కంట్రోల్ చేసుకుంటే అన్నింటా విజయం పొందుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పరిచయాలు వృద్ధి చేసుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనవసరమైన తగాదాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. వృథాఖర్చులు చోటుచేసుకుంటాయి. విద్యార్థులకు అనుకూలం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంట, బయట మౌనంగా ఉంటే మేలు కలుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పని చేయాలనుకుంటారు కానీ ఏదొక ఆటంకం ఎదురవుతుంది. బద్ధకం పెరుగుతుంది. ఎమోషన్స్ ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఆర్థిక విషయాల్లో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అగ్రిమెంట్లకు సంబంధించిన అంశాలు, ప్రేమలు, శుభకార్యాలు, విద్యార్థుల చదువులకు సంబంధించిన అంశాలకు అనుకూలం. ఎదుటివారిని సామ, దాన, బేధ, దండోపాయాల ద్వారా దారికి తెచ్చుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మనసులోని బాధల్ని, భావోద్వేగాలను పంచుకునే వారు చేరువలో ఉంటారు. వినోద కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. ఎక్కువగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story