Sun Dec 22 2024 21:19:18 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం, మే 21 నుండి మే 27 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం శుభకార్యాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. శంకుస్థాపన, గృహప్రవేశం..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, ఆదివారం
తిథి : శు.విదియ రా.10.12 వరకు
నక్షత్రం : రోహిణి ఉ.9.05 వరకు
వర్జ్యం : రా.3.03 నుండి 4.45 వరకు
దుర్ముహూర్తం : సా.4.56 నుండి 5.47 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.00 నుండి 11.40 వరకు, సా.6.00 నుండి 6.40 వరకు
నవగ్రహ సంచారం
మేషం - బుధుడు, గురువు, రాహువు
వృషభం - రవి
మిథునం - శుక్రుడు
కర్కాటకం - కుజుడు
తుల - కేతువు
కుంభం - శని
చంద్రగ్రహ సంచారం
వృషభం, మిథునం, కర్కాటకం, సింహం
మే 21 నుండి మే 27 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఊహించని ఖర్చులుంటాయి. ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులో తెలుసుకోలేక ఇబ్బంది పడతారు. వెన్నుపోటు పొడిచేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గాయాలయ్యేందుకు అవకాశాలెక్కువ. కుటుంబ బాధ్యతలు బరువుగా పరిణమిస్తాయి. సమస్య వెంట సమస్యతో ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులు రొటేషన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం సోమ, మంగళ వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సుదర్శనకవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం శుభకార్యాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. శంకుస్థాపన, గృహప్రవేశం, రిజిస్ట్రేషన్లు సజావుగా సాగుతాయి. వేళకు తగిన ఆహారాన్ని స్వీకరిస్తారు. ఎక్కడికో ఒక ప్రాంతానికి ప్రయాణం చేస్తుంటారు. ఇష్టమైన వారితో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ వారం ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని యధాశక్తిగా పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. అప్పులు ఎక్కువవుతాయి. అప్పు తీసుకున్నవారు తిరిగి చెల్లించకపోవడంతో ఇబ్బంది పడతారు. ఆర్థికంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చికాకులుంటాయి. ఈ వారం సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్ని సార్లు అర్జునకృత దుర్గాస్తోత్రాన్ని పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం సానుకూలంగా ఉంటుంది. డబ్బు చుట్టూనే సంబంధ బాంధవ్యాలు పెరుగుతుండటంతో ధనమే అన్నింటికీ మూలం అనుకుంటారు. విహారయాత్రలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఈ వారం ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయాలి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఆర్థిక విషయాలు విచిత్రంగా ఉంటాయి. వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రమ అధికమవుతుంది. శత్రువులు ఇరికించే ప్రయత్నం చేస్తారు. మంచికి వెళ్లి చెడు తెచ్చుకున్నవారవుతారు. పాత అనారోగ్యం పెరుగుతుంది. ఆలోచనలు పెరుగుతాయి. భవిష్యత్ పై బెంగపడతారు. స్నేహితుల వల్ల ఉపయోగం ఉండదు. వాహనప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఆది,సోమ, మంగళ, శని వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఉద్యోగం మానేసే ఆలోచనలు వాయిదా వేయడం మంచిది. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం వృత్తి, ఉద్యోగాల్లో ప్రశాంతంగా ఉంటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. ఫలితాలు అనుకున్నంత ఉండవు. ఏదైతే అది అవుతుందన్న చందంగా ఆలోచిస్తారు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన మనశాంతి ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. పాతపద్ధతుల్లో ఉండాలన్న నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం మానసిక, శారీరక ఒత్తిడి అధికమవుతుంది. రూపాయి నిలబడదు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ప్రతి రూపాయిని అర్థవంతంగా ఖర్చుచేస్తారు. అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు పనివేళలు పెరుగుతాయి. ఒంటరిపోరాటం చేస్తారు. సహకరించే వర్గం తక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనుల సమయంలోనే మరో ఒత్తిడి వస్తుంది. ఆరోగ్యం పరంగా జీర్ణకోశ వ్యాధులు ఇబ్బంది పెట్టొచ్చు. విదేశీయాన ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ వారం ఆది, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వీలైనన్నిసార్లు కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేసి, రాత్రివేళలో కుక్కకు ఏదైనా ఆహారాన్ని అందించడం మంచిది.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక విషయాల్లో, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎన్నిమందులు వాడినా అనారోగ్యం తగ్గదు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఎదుటివారికి సహాయం చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ వారం ఆది, సోమ, మంగళవారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సహకరించే గ్రహాల సంఖ్య తగ్గుతుంది. ఎవరు మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా.. జీవిత భాగస్వామి ఉన్నారన్న అండతో ఉంటారు. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. ఈ వారం సోమ, మంగళ వారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులకు అవకాశాలెక్కువ. మానసిక ఆనందం ఉండదు. కొత్త సమస్యలు రావు. పాతసమస్యలు పోవు. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులున్నా బాధ్యతలను నెరవేర్చుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మనసుకి సంతోషాన్నిచ్చే సమాచారం అందుకుంటారు.నూతన పరిచయాలు శ్రీరామరక్షగా ఉంటాయనే విధంగా ఆలోచిస్తారు. ఈ వారం బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చైపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగినా.. కంటిన్యుటి ఉండదు. రాత్రివేళలో ఎక్కువగా ఆలోచిస్తారు. అందరినీ సలహా అడిగి మీకు తోచిందే చేస్తారు. ఈ వారమంతా మధ్యస్థ ఫలితాలుంటాయి. మానసిక, శారీరక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ వారం ఆది, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా వీలైనన్ని సార్లు పారాయణ చేయడం మంచిది.
Next Story