Mon Dec 23 2024 07:27:06 GMT+0000 (Coordinated Universal Time)
MAY 23 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ప్రతికూల సమయంలో అనుకూల ఫలితాల కోసం..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, మంగళవారం
తిథి : శు.చవితి రా.12.59 వరకు
నక్షత్రం : ఆరుద్ర మ.12.40 వరకు
వర్జ్యం : రా.1.53 నుండి 3.29 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.20 నుండి 9.12 వరకు, రా.11.06 నుండి 11.50 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.12.00 నుండి 12.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనుల్లో కదలికలు వస్తాయి. నచ్చినవారితో కాలం గడుపుతారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందంమీద మమకారం పెరుగుతుంది. రోజంతా తగాదాలు, వివాదాలతో గడవచ్చు. అలసట అధికంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మూడీగా ఉంటారు. బాగున్నారనుకుంటే రోజంతా బాగుంటారు. బాలేదనుకుంటే రోజంతా అలానే ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి.శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ప్రతికూల సమయంలో అనుకూల ఫలితాల కోసం శ్రమించాల్సి ఉంటుంది. శత్రుబలం పెరుగుతుంది. దృష్టిదోషం అధికమవుతుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది. కీలక, ఆర్థిక విషయాల్లో నిదానమే ప్రధానంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలకు ఇంటికి సంబంధించిన అంశాలకు, వస్తుసామాగ్రిని సమకూర్చుకునేందుకు అనుకూలం. రిస్క్ కు దూరంగా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆచితూచి వ్యవహరిస్తారు. కెరియర్ పై దృష్టిసారిస్తారు. అప్పులు తీర్చే ప్రయత్నాలు చేస్తారు. గతంలో ఇచ్చిన డబ్బును వసూలు చేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రతివిషయాన్ని కీడెంచి మేలెంచాలన్న విధంగా ఆలోచిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గౌరవ, మర్యాదలు లభిస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటారు. పరపతిని పెంచుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుభవం లేని పనుల్లో జోక్యం తగదు. నిదానంగా, ఓపికగా వ్యవహరించాలి. క్రయవిక్రయాలు, ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సర్జరీలకు నిర్ణయాలు తీసుకుంటారు. సాహసోపేత నిర్ణయాలు తగదు. ఖచ్చితంగా కావాలనుకున్న విషయాల్లో ముందడుగు వేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వైలెట్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక ఊరట ఉంటుంది. రహస్య శత్రువులను కనుగొంటారు. ప్రతిపనిలో పర్ ఫెక్షన్ కోరుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువ. తగాదాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఇంట, బయట ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు విలాసవంతమైన వారిపై దృష్టి సారిస్తారు. ఎప్పుడూ ఉండే పనే అన్నట్టుగా ఉంటారు. పని కూడా తప్పనిసరిగా చేయాలన్నట్టుగా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
Next Story