Mon Dec 23 2024 07:54:05 GMT+0000 (Coordinated Universal Time)
MAY 25 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాటతీరులో..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, గురువారం
తిథి : శు.షష్ఠి తె.5.19 వరకు
నక్షత్రం : పుష్యమి సా.5.53 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉ.10.03 నుండి 10.55 వరకు, మ.3.13 నుండి 4.05 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : ఉ.9.00 నుండి 9.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. బద్ధకం పెరుగుతుంది. పనులు వాయిదా పడుతుంటాయి. మంచికిపోతే చెడు ఎదురవుతుంది. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఇచ్చిన అప్పులను వసూలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థలాల క్రయవిక్రయాలకు అనుకూలం. ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాటతీరులో జాగ్రత్తలు తీసుకోవాలి. అలసట పెరుగుతుంది. ప్రయాణాలు తప్పకపోవచ్చు. అంచనాలు తారుమారవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయంలో కీడెంచి మేలెంచాలన్న విధంగా ఆలోచిస్తారు. ఆర్థిక విషయాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారస్తులకు అనుకూలం. ఎక్కువగా ఆలోచిస్తారు. పరిచయాలు పెంచుకుంటారు. వాహన సౌఖ్యం ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురుఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులుంటాయి. విద్యార్థులు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయంలో అధిక జాగ్రత్త అవసరం. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలపై తుదినిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. కొనుగోళ్లపై దృష్టి సారిస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలం. వృత్తి, ఉద్యోగాల్లో మంచి స్థితిగతులుంటాయి. కొత్తవిషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అనేకమైన రహస్యాలను ఎదుటివారి ద్వారా తెలుసుకుంటారు. చేపట్టిన పనిలో విజయాలు పొందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థికంగా లాభనష్టాలుండవు. గౌరవ, మర్యాదలు అంతంత మాత్రంగా ఉంటాయి. పాతపరిచయాలు ఉపయోగపడతాయి. నిరుత్సాహ పరిచే వర్గం అదికంగా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులుంటాయి. నమ్మకద్రోహం జరుగుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అనవసరమైన విషయాలు, వివాదాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఉత్సాహాన్ని కనబరుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. దంపతుల మధ్య తగాదాలు సహజం. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయం రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘ గౌరవం లభిస్తుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఎదుటివారి మాట్లాడుతున్నది విన్నా మనసుకు తోచిందే ఆచరిస్తారు. ఆర్థిక స్థితిగతులు సహజంగా ఉంటాయి. వ్యాపారస్తులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనవసరమైన వాగ్వివాదాలు చోటుచేసుకుంటాయి. వృథా ఖర్చులుంటాయి. చెప్పేదొకటి అర్థమయ్యేది మరొకటిగా ఉంటుంది. ఒంటరిపోరాటంగా జీవితం ఉందన్న ఆలోచనలు బలపడుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం కాదు. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story