Mon Dec 23 2024 07:34:34 GMT+0000 (Coordinated Universal Time)
MAY 26 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. కొనుగోళ్లపై దృష్టి సారిస్తారు. ఆర్థిక..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్రవారం
తిథి : శు.సప్తమి పూర్తిగా
నక్షత్రం : ఆశ్లేష రా.8.49 వరకు
వర్జ్యం : ఉ.8.15 నుండి 10.02 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.20 నుండి 9.12 వరకు, మ.12.39 నుండి 1.31 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.2.00 నుండి 2.45 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నిదానమే ప్రధానమన్న సూత్రాన్ని నమ్ముకోవడం మంచిది. మంచికిపోతే చెడు ఎదురయ్యే విధంగా సంఘటనలు చోటుచేసుకుంటాయి. మనసొక చోట మనిషి మరో చోట ఉంటాయి. అయిష్టంగానే పనులు పూర్తి చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. క్రెడిట్స్ ను క్లియర్ చేసుకుంటారు. అన్నింటా పైచేయిగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. వృథా ఖర్చులు అధికమవుతాయి. శరీరం, మనసు వేగంగా అలసిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు లౌక్యంగా ముందుకి వెళ్తారు. శత్రువుని క్షమించడం జరగదు. చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టి సారిస్తారు. ఒళ్లునొప్పులు బాధిస్తాయి. చింత పెరుగుతుంది. రోజంతా లాభనష్టాలు లేకుండా సాగిపోతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయి. పరిస్థితులు ఒడిదుడుకులుగా సాగుతాయి. ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు నష్టాలుండవు కానీ.. సంతృప్తిగా ఉండదు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. కొనుగోళ్లపై దృష్టి సారిస్తారు. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. మాటవినేవారికే చెప్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాలపై దృష్టి సారిస్తారు. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగులు ముదురు రంగులు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నీ సరిసమానంగా ఉంటాయి. తిట్టేవారు పొగిడేవారు సమానంగా ఉంటారు. ఫైనాన్స్ రంగంలో వారు మాత్రం అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక విషయాలు ఒడిదుడుకులుగా ఉంటాయి. ఎక్కడ తప్పు జరిగినా మీదే బాధ్యత అన్నట్టుగా ఉంటుంది. సునాయాసమైన విషయాలపై మాత్రమే దృష్టి ఉంచడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆరోగ్యం పై దృష్టిసారిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు అనుకూలం. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. మీకు నచ్చినట్టుగా వ్యవహరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలకఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. చర్చలు ఫలిస్తాయి. నూతన పరిచయాలు లాభిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఆరోగ్యం ఒడిదుడుకులుగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఉండేవారితో తగాదాలు, విభేదాలు ఏర్పడుతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. తెలియని మానసిక ఆందోళన ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
Next Story