Mon Dec 23 2024 08:05:19 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం, మే 28 నుండి జూన్ 3 వరకు వారఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. అప్పుచేసి పప్పుకూడు అనే సామెత వర్తిస్తుంది.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, ఆదివారం
తిథి : శు.అష్టమి ఉ.9.55 వరకు
నక్షత్రం : పూర్వఫల్గుణి రా.2.18 వరకు
వర్జ్యం : ఉ.8.33 నుండి 10.20 వరకు
దుర్ముహూర్తం : సా.4.58 నుండి 5.49 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.00 నుండి 11.40 వరకు, సా.5.50 నుండి 6.30 వరకు
నవగ్రహ సంచారం
మేషం - బుధుడు, గురువు, రాహువు
వృషభం - రవి
మిథునం, కర్కాటకం - శుక్రుడు
కర్కాటకం - కుజుడు
కుంభం - శని
చంద్రగ్రహ సంచారం
సింహ, కన్య, తుల, వృశ్చికం
మే 28 నుండి జూన్ 3 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. అప్పు లభిస్తుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటిని, ఆఫీస్ ను మేనేజ్ చేసుకుంటారు. ప్రయాణాలు కలసివస్తాయి. ఉపకరించే పరిచయాలు ఏర్పడుతాయి.ప్రేమలు, ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి..
పరిహారం : ప్రతిరోజూ సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరంగా, ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు. రూమర్స్ ఎక్కువ ప్రచారంలో ఉంటాయి. వ్యాపారస్తులకు ఒత్తిడితో లాభాలుంటాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు అనుకూలం. గడిచిన సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. స్థిరాస్తులపై దృష్టిసారిస్తారు. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఊహించని ఖర్చులుంటాయి. శత్రుబలం అధికంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కలసివస్తాయి. ఎదుటివారితో కమ్యూనికేషన్ చేయడంలో విఫలమవుతారు. వ్యాపారస్తులకు అంతంతమాత్రంగా ఉంటుంది. ఈ వారం ఆది, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ అర్జునకృత దుర్గాస్తోత్రాన్ని పారాయణ చేయాలి.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. అప్పుచేసి పప్పుకూడు అనే సామెత వర్తిస్తుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. అందరూ బాగున్నారు కానీ.. మీ జీవితం బాలేదన్న ఆలోచనలు బలపడుతాయి. వ్యాపారస్తులకు లాభనష్టాలుండవు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఈ వారం సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఒడిదుడుకులు తగ్గుతాయి. శుభకార్య ప్రయత్నాలు కలసివస్తాయి. ఆచితూచి వ్యవహరిస్తారు. దంపతుల మధ్య తగాదాలు సహజం. ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేటు ఉద్యోగస్తులు ఉద్యోగం మారే ప్రయత్నాలకు అనుకూలం కాదు. శుభకార్య ప్రయత్నాలు, శంకుస్థాపనలు, రిజిస్ట్రేషన్లు ఆనందాన్నిస్తారు. ఎవరిపై ఆధారపడకూడదన్న నిర్ణయానికి వస్తారు. ఈ వారం ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నీ నోటివరకూ వచ్చి పోతుంటాయి. ఉత్సాహ, నిరుత్సాహాలు ఉండవు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనయోగం ఉంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకుంటారు. బయటి వాతావరణాన్ని ఇష్టపడతారు. పాతపరిచయాలు ఉపయోగపడతాయి. ఈ వారం సోమ, మంగళ, శనివారాలు అనుకాలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం నిరుత్సాహంగా ఉంటారు. దేనినీ పట్టించుకోరు. ఆర్థిక పరిస్థితి టైట్ గా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు సరైన సమయం కాదు. వివాహ ప్రయత్నాలకు సానుకూలం. మాటపట్టింపులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. ఈ వారం ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఏదొక సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఎంతకష్టపడినా తగిన ఫలితం లేక నిరుత్సాహపడతారు. అనవసరమైన విషయాలపై మనసు మళ్లుతుంది. తెలియని రంగంలో అడుగు పెట్టి నష్టపోతారు. నమ్మినవారే వెన్నుపోటు పొడుస్తారు. రహస్యాలను ఎవరికీ చెప్పకపోవడం మంచిది. దూరప్రాంత ప్రయాణాలుంటాయి. ఈ వారం ఆది, గురు, శుక్రవారాలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. నీలాపనిందలు, అవమానాలను పట్టించుకోరు. అభివృద్ధిపై దృష్టిసారిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ వారం సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలిస్తాయి.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్యహృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. అర్థంచేసుకునేవారు తక్కువ. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రతిచోట కాంప్రమైజ్ అవుతారు. శత్రుబలం పెరుగుతుంది. మానసిక ఇబ్బందులు పెరుగుతాయి. ఈ వారం గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం అవమానాలు పెరుగుతాయి. ఆశించినవారు సహకరించక ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యం పెరుగుతుంది.శ్రేయోభిలాషుల సలహాలు, సూచనలు పాటించడం మంచిది. ఈ వారం ఆది, శనివారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా వీలైనన్నిసార్లు పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం వృత్తి, ఉద్యోగాలకు అనుకూలం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇబ్బందుల్లో తప్పులు తెలుసుకుని సరిదిద్దుకుంటారు. మానసికంగా ధైర్యంగా ఉంటారు. శత్రుబలం పెరుగుతుంది. అనుకున్నంత ఉత్సాహాన్ని కలిగి ఉండరు. ఆర్థిక ఇబ్బందులు, తగాదాలతో నిరుత్సాహపడతారు. ఈ వారం ఆది, సోమ, మంగళ వారాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా వీలైనన్నిసార్లు పారాయణ చేయడం మంచిది.
Next Story