Mon Dec 23 2024 02:47:57 GMT+0000 (Coordinated Universal Time)
MAY 29 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
శత్రువులెవరో, మిత్రులెవరో తెలుసుకోవడంలో వైఫల్యం చెందుతారు. మానసిక సంఘర్షణ అధికమవుతుంది. గడిచిన విషయాలు..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, సోమవారం
తిథి : శు.నవమి ఉ.11.46 వరకు
నక్షత్రం : ఉత్తర ఫల్గుణి తె.4.27 వరకు
వర్జ్యం : ఉ.10.06 నుండి 11.53 వరకు
దుర్ముహూర్తం : మ.12.39 నుండి 1.31 వరకు, మ.3.15 నుండి 4.06 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.10 నుండి 10.10 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో వెసులుబాటు ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంట్లో తగాదాలు పెరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అన్నివిధాలా ఒదిగి ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా ధోరణిలో కొనసాగుతుంటాయి. మనసుకి నచ్చినవారు దూరంగా ఉంటారు. ఇష్టంలేని సంఘటనలు జరుగుతాయి. బద్ధకం పెరుగుతుంది. వృథా ఖర్చులు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గౌరవాన్ని కలిగి ఉంటారు. చర్చలు ఫలిస్తాయి. అధికారుల నుండి ఒత్తిడిని తట్టుకుని ఉంటాయి. ప్రయత్నలోపం లేనంతవరకూ ఇబ్బందులు ఉండవు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మాటపట్టింపులకు పోతారు. అనవసరమైన వివాదాలకు ప్రాధాన్యమిస్తారు. శారీరకంగా, మానసికంగా అలసట పెరుగుతుంది. మంచి చెప్పినా అవమానించినట్లు భావిస్తారు. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికంగా ఊరటగా ఉంటుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. శుభకార్యాల ప్రయత్నాలు కొనసాగుతాయి. వాహన యోగం ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రహస్యాలను రహస్యంగా మెయింటెన్ చేయాలి. శత్రువులెవరో, మిత్రులెవరో తెలుసుకోవడంలో వైఫల్యం చెందుతారు. మానసిక సంఘర్షణ అధికమవుతుంది. గడిచిన విషయాలు జ్ఞాపకానికి వస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఊరటనిచ్చే పరిణామాలు చోటుచేసుకుంటాయి. కాంట్రాక్ట్ రంగంలోవారికి అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. విద్యార్థులు కోర్సులపై దృష్టిపెడతారు. వాహనయోగం ఉంది. స్థిరచరాస్తుల్లో ఇబ్బందులను పరిష్కరించుకోగలుగుతారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గడిచిపోయిన రోజులకంటే ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారు ఆదరించే అవకాశాలు తక్కువ. ఆర్థికంగా ఆశించిన వెసులుబాటు ఉంటుంది. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎదుటివారు చెప్పేది వినకుండానే వాదనలకు వెళ్తారు. చివాట్లు తింటారు. పెద్దలతో జాగ్రత్తగా మసలుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. అనుకున్నదాన్ని సక్సెస్ ఫుల్ గా సాధిస్తారు. ఎదుటివారిని మెప్పిస్తారు. వివాహాది ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story