Mon Dec 23 2024 02:41:58 GMT+0000 (Coordinated Universal Time)
MAY 30 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. సేవింగ్స్ పెరుగుతాయి. శత్రుబలం పెరుగుతుంది.
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, మంగళవారం
తిథి : శు.దశమి మ.1.03 వరకు
నక్షత్రం : హస్త పూర్తిగా
వర్జ్యం : మ.1.23 నుండి 3.05 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.20 నుండి 9.11 వరకు, రా.11.07 నుండి 11.51 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.55 నుండి 12.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం ఆర్థిక విషయాలు సానుకూలంగా సాగుతాయి. రహస్యాలను తెలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సాధారణ ఫలితాలుంటాయి. వైద్య సంప్రదింపులు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలు, విభేదాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. క్రయవిక్రయాలపై జాగ్రత్తగా ఉండాలి. అప్పులకు దూరంగా ఉండాలి. ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో వైఫల్యం చెందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. సేవింగ్స్ పెరుగుతాయి. శత్రుబలం పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చవు. పనులు వాయిదా పడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో పని పూర్తి చేస్తారు. తప్పులను వెంటనే సరిచేసుకుంటారు. కష్టేఫలి అనే సూత్రాన్ని నమ్ముకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. తక్కువగా మాట్లాడాలి. తెలియకుండానే రహస్యాలను బయటపెడతారు. ఇబ్బంది పెట్టేవారి గురించి తెలిసినా చర్యలు తీసుకోలేరు. శారీరక, మానసిక అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. కొత్తవిషయాలు తెలుసుకుంటారు. కొత్తకోర్సులపై ఆసక్తి చూపిస్తారు. ఉపాధ్యాయ, న్యాయవాద వృత్తుల్లో వారికి అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శత్రువులెవరో, మిత్రులెవరో తెలుసుకోవడంలో వైఫల్యం చెందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. నూతన పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. గతంలో చేసిన అప్పుల నుండి బయటపడే అవకాశాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. ఎలర్జీలతో బాధపడేవారికి ఉపశమనం ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అన్నీ మీకే తెలుసన్న ధోరణిలో ఉంటారు. అనుభవజ్ఞుల సూచనలు, సలహాలు పాటించడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. క్రయవిక్రయాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యసూత్రాలు పాటిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story