Mon Dec 23 2024 02:50:00 GMT+0000 (Coordinated Universal Time)
MAY 31 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అనుకూలంగా ఉంటుంది. కీలకమైన విషయాలు మధ్యాహ్నం..
నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బుధవారం
తిథి : శు.ఏకాదశి మ.1.40 వరకు
నక్షత్రం : హస్త ఉ.5.59 వరకు
వర్జ్యం : మ.2.14 నుండి 3.54 వరకు
దుర్ముహూర్తం : ఉ.11.47 నుండి 12.39 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.10 నుండి 9.40 వరకు, సా.4.00 నుండి 4.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పరిచయాలు ఉపకరిస్తాయి. కానీ తెలియని అశాంతి ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల తర్వాతి నుండి అనుకూలంగా ఉంటుంది. కొట్లాటలకు దూరంగా ఉంటారు. ఆర్థికంగా ఊరటగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. చిరాకు, కోపం, ఆవేశం, ఏవీ కలసిరావట్లేదన్న బాధ ఉక్రోషం ఉంటాయి. ఆర్థిక విషయాలు ఒడిదుడుకులుగా ఉంటాయి. వివాదాస్పదమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు లేత ఎరుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఉన్న సమయం మాత్రమే అనుకూలంగా ఉంటుంది. అనవసరమైన విషయాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల తర్వాతి నుంచీ ఉన్న కాలం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఏది ఉన్నా మధ్యాహ్నం తర్వాతి నుంచి చూసుకోవడం మంచిది. శత్రుబలం తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల వరకూ మాత్రమే బావుంటుంది. ఆ తర్వాత వృథా ఖర్చులు పెరుగుతాయి. పనులు తారుమారుగా సాగుతాయి. తెలియని గాబరా వెంటాడుతుంది. రొటేషన్లలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అనుకూలంగా ఉంటుంది. కీలకమైన విషయాలు మధ్యాహ్నం నుంచి చేయడం మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు, శత్రువులపై విజయం సాధించే ప్రయత్నాలకు, ఆర్థిక విషయాలకు మధ్యాహ్నం తర్వాతి నుంచి అనుకూలంగా ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత బాగుంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల వరకూ మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత ఊహించని ప్రయాణాలు, ఊహించని ఖర్చులు ఉంటాయి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మధ్యాహ్నంలోగా పనులు పూర్తి చేసుకోవాలి. రహస్యాలను ఎవరికీ చెప్పకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రోజంతా అనుకూలంగా సాగుతుంది. ఆర్థిక విషయాలు వెసులుబాటు కలిగిస్తాయి. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంది. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఎదుటివారికి చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. మధ్యస్థ ఫలితాలుంటాయి. అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల వరకూ మాత్రమే అనుకూలం. ఆ తర్వాత రూమర్స్ ప్రచారంలో ఉంటాయి. విద్యార్థులకు ఇబ్బందులుంటాయి. తగాదాలు జరుగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
Next Story