Wed Jan 01 2025 05:18:25 GMT+0000 (Coordinated Universal Time)
October 29 : నేడు నాగుల చవితి - ద్వాదశ రాశుల దిన ఫలాలు, పంచాంగం
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆర్థిక సర్దుబాట్లు నేరుగా చేసుకోగలుగుతారు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శనివారం
తిథి : శు.చవితి ఉ.10.19 వరకు
నక్షత్రం : జ్యేష్ట మ.12.01 వరకు
వర్జ్యం : రా.7.30 నుండి 9.00 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.07నుండి 7.39 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.45 నుండి 11.20 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు చేసే కార్యక్రమాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రతివిషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వివాదాలతో పనులు ముడిపడి ఉంటాయి. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిన నిలబెట్టుకోవడం కష్టతరంగా మారుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు శ్రద్ధ తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆర్థిక సర్దుబాట్లు నేరుగా చేసుకోగలుగుతారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవచ్చు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సర్దుబాట్లు చేసుకుంటారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. భార్య-భర్తల మధ్య చిన్న తగాదాలు ఏర్పడవచ్చు. ప్రయాణాలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటా బయట వివాదాలతో కూడుకున్న వాతావరణం ఉంటుంది. వాహన ప్రమాదాలు రావొచ్చు. ప్రతి విషయం గురించి అధికంగా ఆలోచిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు బద్ధకం ఎక్కువగా ఉంటుంది. పనులు వాయిదా వేస్తుంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి-ఉద్యోగాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు సానుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మాట పట్టింపులు చోటుచేసుకుంటాయి. చర్చల్లో తొందరపాటు తగదు. ఈ రోజు ధరించకూడని రంగులు లేత రంగులు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉత్సాహంగా గడుస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. క్రయవిక్రయాలకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు రుణాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు కలసిరాకపోవచ్చు. జరుగుతున్న సంఘటనలతో విసుగు చెందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సానుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ప్రతివిషయంలో చురుగ్గా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి- ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
Next Story