Sun Dec 29 2024 09:34:06 GMT+0000 (Coordinated Universal Time)
NOVEMBER 18 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు, ఈ రాశులవారికి అన్నింటా విజయమే
మనసుకు తృప్తినిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయాన్ని సొంతం చేసుకుంటారు.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్రవారం
తిథి : బ.నవమి ఉ.9.33 వరకు
నక్షత్రం :పూర్వఫల్గుణి రా.11.08 వరకు
వర్జ్యం : తె.5.57 నుండి ఉ.7.40 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.31 నుండి 9.16 వరకు, మ.12.15 నుండి 1.00 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.1.30 నుండి 2.15 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఛాలెంజ్ లు ఎదురవుతాయి. రహస్య శత్రువుల కారణంగా ఇబ్బందులు పెరుగుతాయి. పూర్తవుతాయనుకున్న పనులు ఆగిపోయే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు ఒడిదుడుకులు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాల్లో, ఆస్తి పంపకాల్లో జాగ్రత్తగా ఉండాలి. విహార, వినోద యాత్రల్లో చిన్న గాయాలు కావొచ్చు. ప్రేమలు ఫలిస్తాయి. మానసిక ఆందోళన ఏర్పడుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపుపురంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఫైనాన్స్ రంగాల వారికి అనుకూలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు బలపడతాయి. చర్చలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దృష్టిదోషం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు పాటించడం మంచిది. సంతానం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. నిరుత్సాహపరిచే మాటలు పక్కన పెట్టడం ఉత్తమం. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక పరమైన ఊరట లభిస్తుంది. నూతన ఆలోచనలు చేస్తారు. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అర్థం చేసుకునేవారు తక్కువ. నీలాపనిందలను ఎదుర్కొంటారు. చర్చలు వృథా అవుతాయి. వ్యాపారస్తులకు సానుకూలం. ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. నూతన వస్త్రాలు, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అప్పులు తీర్చే ప్రయత్నాలు చేస్తారు. సినీ, న్యాయవాద, స్వయం ఉపాధి రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. మనసుకు తృప్తినిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. పనులు వాయిదా పడుతుంటాయి. ఎదుటివారి మాటలను పట్టించుకోరు. దంపతుల మధ్య చిన్నపాటి తగాదాలు సహజం. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కు.. ఫలితం అంతత మాత్రంగానే ఉంటుంది. ఉద్యోగం వస్తుందో రాదో క్లారిటీ ఉండదు. చేసిన అప్పులకు ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో వారి సహాయ, సహకారాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ముఖ్యంగా పార్ట్ టైమ్ జాబ్స్ చేసేవారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అనారోగ్య సమస్యల నుండి ఊరట పొందుతారు. పనులు ముందుకు సాగుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటుంది. అప్పులు వసూలు చేస్తారు. వ్యాపారస్తులకు, రాజకీయ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. దూరప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
Next Story