Sun Dec 29 2024 08:33:42 GMT+0000 (Coordinated Universal Time)
NOVEMBER 19 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో వేగం పెరుగుతుంది. తప్పులను..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శనివారం
తిథి : బ.దశమి ఉ.10.29 వరకు
నక్షత్రం : ఉత్తర రా.12.14 వరకు
వర్జ్యం : ఉ.6.17 నుండి ఉ.7.46 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.17 నుండి 7.46 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.10.45 నుండి 11.20 వరకు, సా.5.00 నుండి 6.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. క్రయవిక్రయాలకు సానుకూలంగా ఉంటుంది. కాంట్రాక్ట్ రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పనీ నిదానంగా కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువులు బాధిస్తారు. దృష్టిదోషం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు నిదానంగా సాగుతాయి. వాయిదా పడొచ్చు. ఉద్యోగులకు ఒత్తిడులు తప్పవు. మోహమాటం పనికిరాదు. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. క్రయవిక్రయాలు యోగిస్తాయి. భార్యభర్తల మధ్య తగాదాలు సమసిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. క్రయవిక్రయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ఊహించని ప్రయాణాలు ఏర్పడుతాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులు.. అన్నిరంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు తారుమారుగా సాగుతాయి. ఖర్చులు విస్తారంగా ఉంటాయి. మానసికంగా తెలియని బాధ వెంటాడుతుంది. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో వేగం పెరుగుతుంది. తప్పులను సరిచేస్తారు. చర్చలు ఫలిస్తారు. నూతన వ్యాపారాలపై దృష్టిసారిస్తారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన అవకాశాలు కలసివస్తాయి. పనిపై దృష్టిసారిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ప్రతి పనిని భయంతో వాయిదా వేస్తుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మనసొక చోటు శరీరం మరో చోటు అన్నట్టుగా ఉంటుంది. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేసుకోవాలి. విలువైన వస్తువులను భద్రపరచుకోవాలి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శుభకార్యాలకు సంబంధించిన విషయాలకు అనుకూలంగా ఉంది. చర్చలు ఫలప్రదమవుతాయి. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
Next Story