Mon Dec 23 2024 06:12:24 GMT+0000 (Coordinated Universal Time)
Weekly Horoscope : నేటి పంచాగం, ద్వాదశ రాశుల వారఫలాలు, పరిహారాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం మధ్యస్థ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, ఆదివారం
తిథి : బ.ఏకాదశి రా.10.41 వరకు
నక్షత్రం : హస్త రా.12.36 వరకు
వర్జ్యం : ఉ.8.46 నుండి 10.23 వరకు
దుర్ముహూర్తం : మ.3.59 నుండి 4.44 వరకు
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : మ.12.00 నుండి 1.30 వరకు
శుభ సమయాలు : మ.1.45 నుండి 2.15 వరకు, సా.6.30 నుండి 7.20 వరకు
నవగ్రహ సంచారం
మేషం -రాహువు
వృషభం - కుజుడు
తుల - కేతువు
వృశ్చికం - రవి, బుధుడు, శుక్రుడు
మకరం - శని
మీనం - గురువు
చంద్రగ్రహ సంచారం
కన్య, తుల, వృశ్చికం, ధనస్సు
నవంబర్ 20 నుండి 26 వరకు వారఫలాలు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఖర్చులు - ఆదాయం సమానంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలుంటాయి. అపనిందలు పడొచ్చు. లాయర్లు, వైద్యులు, కాంట్రాక్టర్లు జాగ్రత్తగా ఉండాలి. చర్మ సంబంధ వ్యాధులు బాధిస్తాయి. ఈ వారం ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉంటాయి. సుదర్శన కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నష్టపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్రయవిక్రయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భార్య, భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య తగాదాలు పెరుగుతాయి. పనులన్నీ అసంపూర్తిగా ఉంటాయి. ఉద్యోగమార్పులకు, వ్యాపారవిస్తరణకు అనుకూలం కాదు. ఈ వారం గురు , శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి. నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజూ పారాయణ చేయడం మంచిది.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారమంతా కలసొచ్చే కాలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులకు అవకాశాలు పెరుగుతాయి. సహకరించని వర్గం కూడా సహకరిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. శత్రుబలం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఉపయుక్తంగా ఉంటాయి. ఈ వారం గురు,శుక్ర, శనివారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం పనులు చాలా కష్టతరమవుతాయి. నిరుత్సాహం పనికిరాదు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు అనుకూలం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. స్థిరాస్తులపై దృష్టి సారిస్తారు. అనువంశిక ఆస్తులు కలసివస్తాయి. ఈ వారం ఆది, సోమ, శనివారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయాలి.
సింహరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. ఇష్టమైన ఆహారం తినగలుగుతారు. ఆరోగ్యంపై దృష్టిసారిస్తారు. ఇంటి మార్పులు ఉంటాయి. అపరిష్కృత సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ వారం మంగళ మాత్రమే అనుకూలంగా ఉంటుంది. శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
కన్యరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారమంతా ఆనందంగా గడిచిపోతుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు రొటేషన్ల విషయంలో ఇబ్బంది పడతారు. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ వారం ఆది, సోమవారాలు అనుకూలిస్తాయి. దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
తులారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. సంఘ గౌరవం పెరుగుతుంది. ఇష్టమైన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదు. ఈ వారమంతా విజయం దిశగా కొనసాగుతారు. ఖర్చులు విస్తారంగా ఉంటాయి. అలసట పెరుగుతుంది. ఈ వారం మంగళ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృశ్చికరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. కోర్టుకేసుల్లో అనుకూల తీర్పులు వస్తాయి. అంచనాలు నెరవేరుతాయి. కుటుంబం గురించే ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పనులు వాయిదా పడుతుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రతి విషయంలో పద్ధతిగా ముందుకెళ్తారు. ఈ వారం ఆది, సోమ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి. విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం మధ్యస్థ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. వ్యాపారాల్లో మార్పులకు అనుకూల సమయం కాదు. ఉద్యోగస్తులకు పనివేళలు పెరుగుతాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలు పెరుగుతాయి. విదేశీయాన ప్రయత్నాలకు కూడా అనుకూలం కాదు. ఈ వారం ఆది, సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సానుకూల ఫలితాలుంటాయి. క్రయవిక్రయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. ముక్కుసూటితనంతో ఇబ్బందులు పడతారు. అన్ని రంగాలవారికి ఈ వారమంతా అనుకూలంగా ఉంటుంది. దుర్గా అమ్మవారిని ప్రతిరోజూ పూజించటం మంచిది.
కుంభరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. శత్రుబలం పెరుగుతుంది. తప్పు లేకపోయినా నిందలు ఎదుర్కొంటారు. ప్రతి విషయం తగాదాలు, వివాదాలతో ముడి పడి ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఆరోగ్యం మందగిస్తుంది. ఈ వారం శనివారం మాత్రమే అనుకూలంగా ఉంటుంది. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ వారం సాధారణ ఫలితాలుంటాయి. పనులు వాయిదా పడుతుంటాయి. అంచనాలు తారుమారవుతాయి. ఆదాయం - వ్యయం సమానంగా ఉంటాయి. అప్పులు అందుతాయి. కొన్ని పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. నిద్రలేమి సమస్య బాధిస్తుంది. పనివేళలు పెరుగుతాయి. ఈ వారం ఆది, సోమ, శనివారాలు కలసివస్తాయి. ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం మంచిది.
Next Story