Sun Dec 29 2024 08:46:12 GMT+0000 (Coordinated Universal Time)
NOVEMBER 25 : నేటి పంచాగం, ఈ రాశులవారు సాయంత్రంలోగా పనులు పూర్తిచేసుకోండి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం వరకూ అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాతి నుండి ఖర్చులు పెరుగుతాయి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, శుక్రవారం
తిథి : శు. విదియ రా.10.35 వరకు,
నక్షత్రం : జ్యేష్ఠ సా.5.21 వరకు
వర్జ్యం : రా.12.34 నుండి 2.00 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.34 నుండి 9.18 వరకు, మ.12.17 నుండి 1.01 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : మ.1.30 నుండి 2.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. పనులు వాయిదా పడుతుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రతివిషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ముఖ్యమైన పనులు సాయంత్రంలోగా పూర్తిచేసుకోవాలి. వ్యాయామాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి సాధారణ ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రయవిక్రయాలపై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు సాయంత్రం లోపు వరకూ వ్యతిరేక ఫలితాలుంటాయి. పనులు వాయిదా పడొచ్చు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. మధ్యవర్తిత్వాల వల్ల నష్టపోతారు. ఈ రోజు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. వ్యాపారపరమైన చర్చలు జరుపుతారు. కీలక అంశాలు వాయిదా పడుతుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం లోగా ముఖ్యమైన పనులు పూర్తిచేసుకోవడం మంచిది. ఆలోచనల్లో మార్పు ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం వరకూ విపరీతమైన ఖర్చులుంటాయి. మాట పట్టింపులు ఉంటాయి. సాయంత్రం తర్వాతి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడుతాయి. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం వరకూ అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాతి నుండి ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లోవారితో మనస్పర్థలు ఏర్పడవచ్చు. ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం వరకూ ప్రతికూలంగా.. ఆ తర్వాతి నుండి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. వైద్య సంప్రదింపులు ఊరట నిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఉపయోగపడుతాయి. కుటుంబ సభ్యుల అవసరాల్ని తీరుస్తారు. కుటుంబ బాధ్యతలు కాస్త తగ్గుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు లాభసాటిగా సాగుతుంది. కాంట్రాక్ట్ రంగాల వారికి అనుకూలం. వివాహ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాయంత్రం వరకూ వ్యతిరేకంగా.. ఆ తర్వాత అనుకూలంగా ఉంటుంది. పనులు వాయిదా పడుతుంటాయి. ఒప్పందాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
Next Story